న్యూఢిల్లీ, మే 1: అంతర్జాతీయంగా చమురు ధరలు క్షీణించడంతో వాణిజ్య సిలిండర్ ధర సైతం తగ్గింది. వాణిజ్య సిలిండర్ ధర రూ.171.5 మేర తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర ప్రస్తుతం రూ.2,028 ఉండగా, ఇకపై రూ.1,856.5కు లభించనున్నది.
అంతర్జాతీయ చమురు ధరలను తగ్గించడంతో జెట్ ఇంధనం రేట్లు (ఏటీఎఫ్) 2.45 శాతం తగ్గాయి. గృహ వినియోగ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ రూ.1,103కు లభిస్తున్నది.