అమృత్సర్: మద్యపాన ప్రియులు విమానాలలో అనుచితంగా ప్రవర్తిస్తూ తరచూ వార్తలకెక్కుతున్నారు. అలాంటి ఘటనే ఇండిగో విమానంలో శనివారం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఎయిర్ హోస్టెస్ పట్ల అనుచితంగా వ్యవహరించిన ప్రయాణికుడిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశా రు.
జలంధర్‌లోని కొట్లి గ్రామానికి చెందిన రాజీందర్ సింగ్ శనివారం దుబాయ్-అమృత్సర్ విమానంలో ప్రయాణిస్తూ మద్యం మత్తులో ఎయిర్ హోస్టెస్‌తో తీవ్ర వాగ్వివాదం పెట్టుకుని అమెను వేధిస్తూ అనుచితంగా వ్యవహరించాడు.