విశ్వంలోనే అత్యంత పురాతనమైన నక్షత్రాల గుంపును జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గుర్తించింది. 81 ట్రిలియన్ కిలో మీటర్ల దూరంలో అవి వెలుగులు విరజిమ్ముతూ కనువిందు చేశాయి. ఆ గుంపునకు శాస్త్రవేత్తలు ‘వెలుగుల పాలపుంత’ అని పేరు పెట్టారు. ఆ నక్షత్రాలున్న చోటు విశ్వంలోనే పురాతన నక్షత్రాలకు నివాసం అయ్యి ఉండొచ్చని అంచనా
వేస్తున్నారు.