న్యూఢిల్లీ, మే 29: తనకు ఓ వారసుడు ఉండాలన్న కోరిక ప్రతి కుటుంబానికి ఉండటం సహజం. ఒకవేళ వారసుడు జన్మించకపోతే దత్తతనైనా తీసుకుంటుంటారు. కొన్ని ఏండ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతున్నప్పటికీ.. గత మూడేండ్ల కాలంలో మాత్రం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అబ్బాయి బదులు అమ్మాయిని దత్తత తీసుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా రోజురోజుకు తగ్గిపోతున్న స్త్రీ నిష్పత్తి శాతం పెరుగడానికి తాజా పరిణామం ఉపయోగపడనుంది.
దత్తత తీరుతెన్నులు ఇలా..
సంవత్సరం : అబ్బాయిలు : అమ్మాయిలు
2021-22 : 1,276: 1,674
2020-21 : 1,286: 1,856
2019-20 : 1,413 : 1,938