నేడే ఐదో విడత
సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం జరగనుంది. ఆరు రాష్ర్టాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ నియోజకవర్గాలకు ఈ విడతలో ఎన్నికలు జరగనున్నాయి.
- 49 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు
- బరిలో రాహుల్‌గాంధీ, స్మృతి ఇరానీ, రాజ్‌నాథ్, గోయల్ తదితర ప్రముఖులు
- ఒడిశాలో 35 అసెంబ్లీ సీట్లకూ పోలింగ్
న్యూఢిల్లీ, మే 19: సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం జరగనుంది. ఆరు రాష్ర్టాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ నియోజకవర్గాలకు ఈ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్, సాధ్వి నిరంజన్ జ్యోతి, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సహా పలువురు కీలక నాయకులు ఈ విడతలో పోటీ పడుతున్నారు. మొత్తం 94,732 పోలింగ్ స్టేషన్లలో 8.95 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ 49 స్థానాల్లో 40 స్థానాలు ఎన్డీయే సిట్టింగ్ స్థానాలు కావడంతో బీజేపీకి ఈ దశ చాలా కీలకంగా మారింది.
యూపీలో కాంగ్రెస్‌కు అసలైన పరీక్ష
ఉత్తరప్రదేశ్‌లోని 14 స్థానాలకు సోమవారం పోలింగ్ జరుగుతుంది. ఇందులో రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న రాయ్‌బరేలీ, స్మృతి ఇరానీ పోటీ చేస్తున్న అమేథీ, రాజ్‌నాథ్ సింగ్ పోటీ చేస్తున్న లక్నో స్థానాలు ఉన్నాయి. కేంద్ర మంత్రులు కౌశల్ కిశోర్(మోహన్‌లాల్ గంజ్), సాధ్వి నిరంజన్ జ్యోతి(ఫతేహ్పూర్), భానుప్రతాప్ సింగ్ వర్మ(జలౌన్) కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాంగ్రెస్ యూపీలో ఇప్పటికీ బలంగా కనిపిస్తున్న రాయ్‌బరేలీ, అమేథీ స్థానాల్లో ఫలితాలపై అందరి ఆసక్తి నెలకొంది.
ఆర్థిక రాజధానిలో ఆధిపత్యం ఎవరిది?
మహారాష్ట్రలోని 13 స్థానాలకు ఐదో దశలో పోలింగ్ జరగనుంది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలోని పది స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్(ముంబై ఉత్తర), భారతి పవార్(దిండోరి), కపిల్ పాటిల్(భీవండి) బరిలో ఉన్నారు. మహారాష్ట్ర సీఎం షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే మరోసారి కల్యాణ్ నుంచి పోటీచేస్తున్నారు. శివసేన, ఎన్సీపీలో చీలక నేపథ్యంలో ఈ ఎన్నికలు కీలకంగా మారాయి.
బీహార్‌లో ఐదు.. జార్ఖండ్‌లో 3 స్థానాలకు
ఎన్డీయేకు గట్టి పోటీ ఎదురవుతున్న బీహార్‌లోని ముజఫర్‌పూర్, మధుబని, సీతామర్హి, సరన్, హజీపూర్ స్థానాలకు ఈ దశలో పోలింగ్ జరగనుంది. హజీపూర్ నుంచి లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్, సరన్ నుంచి ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్య, మాజీ కేంద్రమంత్రి రాజీవ్ ప్రతాప్ రూడి బరిలో ఉన్నారు. మరోవైపు జార్ఖండ్‌లోని గోండే శాసనసభ సీటుకు ఉప ఎన్నికకు సోమవారం పోలింగ్ జరుగనుంది. గోండే నుంచి మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ భార్య కల్పనా సొరేన్ పోటీ చేస్తున్నారు.
- ఒడిశాలోని అస్క, కంధమల్, బార్‌గర్హ్, బొలంగిర్, సుందర్‌గర్హ్ లోక్‌సభ స్థానాలకు 35 అసెంబ్లీ స్థానాలకు సోమవారం పోలింగ్ జరగనుంది. సీఎం నవీన్ పట్నాయక్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు.
- తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ ఉన్న పశ్చిమ బెంగాల్ దక్షిణ ప్రాంతంలోని హౌరా, హుగ్లి, సెరంపోర్, బర్రాక్పోర్, ఉలుబేరియా, ఆరాంబాగ్, బన్గాం స్థానాలకు పోలింగ్ జరగనుంది.
- జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత మొదటిసారిగా కీలక ఎన్నికల పోరు జరగనుంది. బారాముల్లా నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నుంచి బరిలో ఉన్నారు. ఆయనకు పీపుల్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు సజ్జద్ గట్టి పోటీ ఇస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

