Obesity | ఊబకాయంపై వర్రీ.. దేశంలో పెరుగుతున్న ఒబెసిటీ
మన దేశంలో మొత్తం వ్యాధుల భారంలో 54 శాతానికి కారణం అనారోగ్యకర ఆహారమేనని ఆర్థిక సర్వే 2023-24 తెలిపింది.
- 54 శాతం వ్యాధుల భారానికి అనారోగ్యకర ఆహారమే కారణం
- ఆర్థిక సర్వే 2023-24లో వెల్లడి
Obesity | న్యూఢిల్లీ: మన దేశంలో మొత్తం వ్యాధుల భారంలో 54 శాతానికి కారణం అనారోగ్యకర ఆహారమేనని ఆర్థిక సర్వే 2023-24 తెలిపింది. దేశంలో పెరుగుతున్న ఊబకాయ సమస్యపై ఆందోళన వ్యక్తం చేసింది. కొవ్వు, చక్కెరలతో ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం విపరీతంగా పెరగడంపై అప్రమత్తత అవసరమని పేర్కొన్నది. ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకునేలా ప్రజలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పింది.
మన దేశ వయోజనుల్లో ఇది తీవ్ర సమస్యగా పరిణమిస్తున్నదని హెచ్చరించింది. పని చేయగలిగే సామర్థ్యం గల జనాభా వల్ల సత్ఫలితాలను సాధించాలంటే, ప్రజలు సమతుల, వైవిధ్యభరితమైన ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యమని ఈ నివేదిక స్పష్టం చేసింది. భారత వైద్య పరిశోధన మండలి నివేదికను ఉటంకిస్తూ, కొవ్వు, చక్కెరలతో కూడిన హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ వినియోగం పెరుగుతుండటం, దానితోపాటు శారీరక శ్రమ తగ్గిపోవడం ఊబకాయం సమస్యలకు దారితీస్తున్నట్లు వివరించింది.
పట్టణాల్లోనే అధికం
మన దేశంలో వయోజనుల్లో ఊబకాయం రేటు మూడు రెట్లు కన్నా ఎక్కువకు పెరిగిందని నివేదిక తెలిపింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం, గ్రామీణ ప్రాంతాల్లో కన్నా పట్టణాల్లో ఊబకాయం సమస్య తీవ్రంగా ఉందని వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

