ATM Charges | న్యూఢిల్లీ, జూన్ 13: ప్రస్తుతం వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న ఏటీఎం చార్జీలు పెంచుతారా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. ప్రస్తుతం ఉన్న ఇంటర్‌ఛేంజ్ ఫీజు పెంచాలని కాన్ఫిడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ (సీఏటీఎంఐ) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్‌కు విజ్ఞప్తి చేసింది.
కనీసం 23 రూపాయలకు పెంచాలని కోరింది. కాగా, ఒక బ్యాంక్‌కు సంబంధించిన ఏటీఎం కార్డును మరో బ్యాంక్ ఏటీఎంలో వినియోగించడాన్నే ఇంటర్ ఛేంజ్ అంటారు. ప్రస్తుతం 21 ఉండగా, దానిని 23 రూపాయలు చేయాలంటూ ఏటీఎం నిర్వహణ సంస్థ అడుగుతున్నది.