Pune Porsche Case | కోర్టులోనే లంచం చెల్లింపు.. రక్తం శాంపిళ్లను మార్చడంలో డాక్టర్ అజయ్ సిద్ధహస్తుడు
పుణెలో గత నెల 19న జరిగిన పోర్షే కారు ప్రమాదం కేసులో తవ్విన కొద్దీ దారుణాలు వెలుగు చూస్తున్నాయి.
- పుణె పోర్షే కారు కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి
Pune Porsche Case | పుణె: పుణెలో గత నెల 19న జరిగిన పోర్షే కారు ప్రమాదం కేసులో తవ్విన కొద్దీ దారుణాలు వెలుగు చూస్తున్నాయి. మైనర్‌ను ఈ కేసు నుంచి తప్పించేందుకు జువెనైల్ జస్టిస్ బోర్డు ప్రాంగణంలోనే లంచాన్ని చెల్లించినట్లు దర్యాప్తులో బయటపడటం విస్మయపరుస్తున్నది. పోర్షే కారును విచక్షణారహితంగా నడిపి ఇద్దరు దంపతుల ప్రాణాలు తీసిన మైనర్ రక్తం శాంపిళ్లు తారుమారైనట్లు పోలీసులు చెప్పిన సంగతి తెలిసిందే. మైనర్ బాలుని రక్తానికి బదులుగా అతని తల్లి రక్తాన్ని పరీక్షించి, నివేదిక ఇచ్చేందుకు రూ.3 లక్షలు లంచం చెల్లించారని పోలీసు దర్యాప్తులో తెలిసింది. నిందితుని తండ్రి విశాల్ అగర్వాల్ ఈ సొమ్మును సస్సూన్ హాస్పిటల్ వార్డ్ బాయ్ అతుల్ ఘట్కాంబ్లేకు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
మరోవైపు ఈ కేసులో నిందితుడైన డాక్టర్ అజయ్ తావడే పెద్ద నెట్‌వర్క్‌ను నడుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ పత్రిక తెలిపింది. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి చెందిన ఓ మంత్రి, ఎమ్మెల్యే సిఫారసు మేరకు డాక్టర్ తావడే సస్సూన్ హాస్పిటల్ ఫోరెన్సిక్ మెడికల్ డిపార్ట్మెంట్ హెడ్‌గా నియమితులైనట్లు తెలుస్తున్నది. ఈ డాక్టర్ గతంలో కూడా చాలా మందికి ఇదే విధంగా రక్త నమూనాలను మార్చి, తప్పుడు ధ్రువీకరణ ప్రతాలు ఇచ్చినట్లు సమాచారం. మద్యం సేవించి, వాహనాన్ని నడిపి, ప్రమాదానికి గురైనపుడు ఈ డాక్టర్ నెట్‌వర్క్‌లోని బ్రోకర్లు రంగంలోకి దిగుతారని; కనీసం రూ.5 లక్షలు వసూలు చేసి, రక్తం శాంపిళ్లను మార్చి, మద్యం సేవించలేదని నివేదికలు వచ్చేలా చేస్తున్నారని తెలిసింది. ఇలా చేయడం వల్ల నిందితులకు స్వల్ప శిక్ష పడుతుంది. ఈ కేసులో నిందితుడైన మైనర్‌కు అబ్జర్వేషన్ హోమ్ రిమాండ్‌ను జువెనైల్ జస్టిస్ బోర్డ్ ఈ నెల 25 వరకు పొడిగించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

