న్యూఢిల్లీ, మార్చి 17: దేశంలో కొత్త ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటుపై నిషేధాన్ని ఎత్తివేయాలని ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) నిర్ణయించింది.
2022 విద్యా సంవత్సరంలో బీటెక్‌లో ప్రవేశాలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు ఏఐసీటీఈ మెంబర్ సెక్రటరీ రాజీవ్ కుమార్ శుక్రవారం వెల్లడించారు. కొత్త ఇంజినీరింగ్ కాలేజీల ఏర్పాటుపై ఏఐసీటీఈ 2019లో నిషేధం విధించింది.