BJP | తమిళనాడులో బలపడటమే లక్ష్యంగా బీజేపీ పావులు.. హీరో విజయ్ పార్టీతో పొత్తు!
తమిళనాట సరికొత్త రాజకీయాలకు వచ్చే లోక్‌సభ ఎన్నికలు వేదికగా మారబోతున్నాయి. తమిళ సినీ హీరో విజయ్‌పై విమర్శలు, ఆరోపణలు చేసిన బీజేపీ.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అతనితో జతకట్టేందుకు సిద్ధమవుతున్నది.
- గత విభేదాలు పక్కనబెట్టిన కమలం పార్టీ
BJP | చెన్నై, జనవరి 31: తమిళనాట సరికొత్త రాజకీయాలకు వచ్చే లోక్‌సభ ఎన్నికలు వేదికగా మారబోతున్నాయి. తమిళ సినీ హీరో విజయ్‌పై విమర్శలు, ఆరోపణలు చేసిన బీజేపీ.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అతనితో జతకట్టేందుకు సిద్ధమవుతున్నది. హీరో విజయ్ స్థాపించబోయే పార్టీతో బీజేపీ రహస్య పొత్తు కుదుర్చుకుంటుందని, తెరవెనుక ఒప్పందానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తమిళనాట ఊహాగానాలు వెలువడుతున్నాయి.
విజయ్ పార్టీ-బీజేపీ మధ్య తెరవెనుక పొత్తు ఉంటుందని, కొన్ని స్థానాల్లో బీజేపీ గెలుపు కోసం విజయ్, ఆయన అభిమాన సంఘాలు పనిచేసేలా ఒప్పందం ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతున్నది. దీనికి సంబంధించి బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి హీరో విజయ్‌కు సంకేతాలు వెళ్లాయని, అందువల్లే దీనిని బలపరుస్తూ హీరో విజయ్ నుంచి ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు వెలువడ్డాయని వార్తా కథనాలు వెలువడ్డాయి. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తర్వాత ఆ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరో విజయ్ ఒక్కరే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

