Home
National
Telegram Ceo Pavel Durov Says He Will Leave His Huge 17 Billion Fortune To His 106 Children
నా వీర్యదానంతో జన్మించిన 100 మందికి సంపద పంచేస్తా
టెలిగ్రాం వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్ సంచలన ప్రకటన చేశారు. ఫ్రాన్సిస్ లీ పాయింట్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తన వీర్య దానంతో జన్మించిన వంద మంది పిల్లలకు సంపదను సమంగా పంచుతానని చెప్పారు.
- టెలిగ్రాం సీఈవో దురోవ్ ప్రకటన
న్యూఢిల్లీ : టెలిగ్రాం వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్ సంచలన ప్రకటన చేశారు. ఫ్రాన్సిస్ లీ పాయింట్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తన వీర్య దానంతో జన్మించిన వంద మంది పిల్లలకు సంపదను సమంగా పంచుతానని చెప్పారు. అయితే వారికి 30 ఏండ్లు వచ్చే వరకు మాత్రం సంపదపై హక్కు లభించబోదని స్పష్టం చేశారు. తనకు ముగ్గురు జీవిత భాగస్వాములతో ఆరుగురు పిల్లలు ఉన్నారని తెలిపారు.
అయితే పదిహేనేండ్లుగా తాను వీర్యదానం చేస్తున్నట్టు, తద్వారా 100 మంది పిల్లలు పుట్టినట్టు ప్రకటించారు. అయితే వీరందరినీ ఒకేలా చూస్తానని, ఎలాంటి వ్యత్యాసం ఉండదని చెప్పారు. తన సంపదపై వీరిందరికీ సమాన హక్కు దక్కుతుందని ప్రకటించారు. అయితే 30 ఏండ్ల వరకు తన సంపద తన పిల్లలు ముట్టుకోకుండా వీలునామా రాసినట్టు తెలిపారు. ప్రస్తుతం పావెల్ దురోవ్ సంపద దాదాపు రూ.1.4 లక్షల కోట్లు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

