పాట్నా : ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్ రెండో కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్(Tej Pratap Yadav) గురువారం మహువా నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనశక్తి జనతాదళ్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. తల్లితండ్రులతో విబేధాలు పెట్టుకుని ఆర్జేడీకి దూరమైన తేజ్ ప్రతాప్ ఇటీవల కొత్తగా జనశక్తి జనతాదళ్ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. అయితే నామినేషన్ వేసేందుకు వెళ్తున్న సమయంలో తేజ్ ప్రతాప్ తనతో పాటు తన నానమ్మ ఫోటోను తీసుకెళ్లారు. లాలూ ప్రసాద్ యాదవ్ మాతృమూర్తి మరచియ్య దేవి ఫోటోను తీసుకుని నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లారు. రెండు రోజుల క్రితం తేజస్వి యాదవ్ నామినేషన్ వేస్తున్న సమయంలో అతనితో పాటు లాలూ ప్రసాద్, రబ్రీ దేవి కూడా ఆఫీసుకు వెళ్లారు.
ఓ వివాదం నేపథ్యంలో ఆర్జేడీ నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్‌ను ఆరేళ్ల పాటు వెలివేసిన విషయం తెలిసిందే. దీంతో తాజాగా తేజ్ ప్రతాప్ యాదవ్ .. జనశక్తి జనతాదళ్ పార్టీని స్థాపించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ఆ పార్టీ తరపున ఇప్పటికే 20 మంది అభ్యర్థులను ప్రకటించారు. మహువా నుంచి తేజ్ ప్రతాప్ పోటీ చేస్తుండగా, రఘోపూర్ నుంచి తేజస్వి యాదవ్ పోటీ చేస్తున్నారు.
आज अपने राजनैतिक कर्मभूमि महुआ विधानसभा से अपनी दादी स्व० मरछिया देवी जी की तस्वीर के साथ महुआ अनुमंडल कार्यालय हजारों समर्थकों और पार्टी कार्यकर्ताओं के साथ पहुंचकर नामांकन दाखिल किया।
महुआ मेरे लिए हमेशा एक राजनीतिक कर्मभूमि से अधिक मेरा परिवार रहा है। महुआ विधानसभा की आदरणीय… pic.twitter.com/CS8LxMW64i
— Tej Pratap Yadav (@TejYadav14) October 16, 2025