న్యూఢిల్లీ : నింగిలో ఉండగా సాంకేతిక సమస్య తలెత్తడంతో రెండు డ్రీమ్‌లైనర్ విమానాలు మళ్లీ వెనక్కి మళ్లాల్సి వచ్చింది. సోమవారం ఉదయం హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి న్యూఢిల్లీ బయల్దేరిన ఎయిరిండియాకు చెందిన 787-8 డ్రీమ్‌లైనర్ విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్లు.. తాము ముందుకు వెళ్లదలచుకోలేదని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు తెలియచేసి తిరిగి విమానాన్ని హాంకాంగ్‌కు మళ్లించారు.
ఉదయం 9.30 గంటలకు టేకాఫ్ అయిన హాంకాంగ్-న్యూఢిల్లీ విమానం 90 నిమిషాల్లోనే వాపసు వచ్చినట్లు ఆన్లైన్ట్రాకర్ ఫ్లైట్ రాడార్ 24 డాటా చూపించింది. మరోవైపు, ఆదివారం లండన్ నుంచి చెన్నై బయల్దేరిన బ్రిటిష్ ఎయిర్వేస్కు చెందిన 787-8 డ్రీమ్‌లైనర్ విమానం నింగిలో సాంకేతిక సమస్య తలెత్తడంతో లండన్‌కు వాపసు వచ్చింది. టేకాఫ్ అయిన రెండు గంటల తర్వాత విమానం లండన్‌కు వాపసు వచ్చింది.