పాట్నా: స్కూల్‌కు వెళ్తున్న టీచర్‌ను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అతడ్ని గన్స్‌తో బెదిరించి కొట్టి గుడి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ పెళ్లికూతురు ముస్తాబులో ఉన్న మహిళతో బలవంతంగా పెళ్లి చేశారు. (Teacher Kidnapped Forced To Marry) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీహార్‌లోని కతిహార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బేగుర్సరాయ్ జిల్లాలోని రాజౌరాకి చెందిన అవ్నీష్ కుమార్ ఇటీవల ప్రభుత్వ టీచర్ ఉద్యోగం పొందాడు. కతిహార్ జిల్లాలోని మిడిల్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.
కాగా, లఖిసరాయ్ జిల్లాకు చెందిన గుంజన్ అనే మహిళతో అవ్నీష్కు నాలుగేళ్లుగా ప్రేమ వ్యవహారం ఉంది. అయితే టీచర్ ఉద్యోగం వచ్చిన తర్వాత ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆటోలో స్కూల్‌కు వెళ్తున్న అవ్‌నీష్‌ను రెండు వాహనాల్లో వచ్చిన కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. గన్స్‌తో బెదిరించి కొట్టి అతడ్ని కిడ్నాప్ చేశారు. ఒక ఆలయం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ పెళ్లికూతురి అలంకరణలో ఉన్న గుంజన్‌తో బలవంతంగా పెళ్లి చేశారు.
మరోవైపు ఈ బలవంతపు పెళ్లి తర్వాత గుంజన్ తన కుటుంబంతో కలిసి అవ్నీష్ ఇంటికి వెళ్లింది. అయితే ఆమెను కోడలుగా స్వీకరించేందుకు అతడి కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ గుంజన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కాగా, గుంజన్‌తో తనకు ఎలాంటి ప్రేమ వ్యవహరం లేదని అవ్నీష్ ఆరోపించాడు. ఆమె తన వెంటపడి వేధించిందని తెలిపాడు. స్కూల్‌కు వెళ్తున్న తనను కొంతమంది వ్యక్తులు కిడ్నాప్ చేశారని, కొట్టి బలవంతంగా గుంజన్‌తో పెళ్లి తంతు జరిపించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల ఫిర్యాదులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ‘పకడ్వా వివాహం’గా బీహార్‌లో పాపులర్ అయిన ఈ బలవంతపు పెళ్లి వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Bihar: BPSC शिक्षक का अपहरण कर जबरन कराई शादी… #Bihar #Begusarai #marriage pic.twitter.com/Ir20FaOOnQ
— JANDHARA24x7 (@AJandhara) December 14, 2024