Whale Vomit | రూ.31.6కోట్ల విలువైన తిమింగళం వాంతి పట్టివేత..! దీనికి ఎందుకంత డిమాండ్ ఎందుకో తెలుసా..?
Whale Vomit | తమిళనాడులో వేల్ అంబర్‌గ్రీస్‌ను (తిమింగళం వాంతి) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టుటికోరిన్ బీచ్ వద్ద డీఆర్ఐ నలుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసింది. వారి నుంచి 18.1 కిలోల బరువున్న వేల్ అంబర్ గ్రీస్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
Whale Vomit | తమిళనాడులో వేల్ అంబర్‌గ్రీస్‌ను (తిమింగళం వాంతి) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టుటికోరిన్ బీచ్ వద్ద డీఆర్ఐ నలుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసింది. వారి నుంచి 18.1 కిలోల బరువున్న వేల్ అంబర్ గ్రీస్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్ దాని విలువ రూ.31.6 కోట్లకంటే ఎక్కువ ఉంటుందని డీఆర్ఐ పేర్కొంది. అంబర్‌గ్రీస్‌ను ఫ్లోటింగ్ గోల్డ్‌గా పిలుస్తుంటారు. దీన్ని సుగంధ పరిమళాల తయారీలో వినియోగిస్తుంటారు. దాంతో మార్కెట్లో భారీగా డిమాండ్ ఉంటుంది. సముద్రంలో తేలియాడే అంబర్గ్రిస్ అప్పుడప్పుడు సముద్రంలో దొరుకుతుంది.
ఎలా దొరుకుతుంది..?
మైనంలా ఉండే ఈ పదార్థం అంబర్ గ్రిస్. ఇది స్పర్మ్ తిమింగళాల (sperm whales) జీర్ణవ్యవస్థలో సహజసిద్ధంగా తయారవుతుంది. చాలా మంది దీన్ని తిమింగలం వాంతి అంటారు. భారీ స్థాయిలో ఉండే సముద్ర జీవులను స్పర్మ్ వేల్స్ మింగినప్పుడు, వాటిల్లో ఉండే కఠినమైన, పదునైన వస్తువులను బయటకు పంపించేందుకు, వాటి కదలికలను మెరుగుపరిచేందుకు అంబర్గ్రిస్ సాయం చేస్తుంది. కొన్నిసార్లు ఈ అంబర్గ్రిస్ మలం మాదిరిగా బయటకు వస్తుంది. దానికి తీవ్రమైన మలం వాసనతో పాటు తీవ్రమైన సముద్రపు వాసన ఉంటుంది. నీలి తిమింగలాలతో పోల్చితే స్మర్మ్ వేల్స్ ఆకారంలో చిన్నగా ఉంటాయి. కానీ, వీటి మెదడు భారీ స్థాయిలో ఉంటుంది. వీటి కడుపులో నుంచి అప్పుడే వెలువడే అంబర్ గ్రిస్ లేత పసుపు వర్ణంలో కొవ్వుతో ఉంటుంది. కాలం గడుస్తున్న కొద్ది అది మైనంలా మారి ముదురు గోధుమ రంగులోకి మారుతుంది. దీనికి ఘాటైన మట్టి వాసనతో పాటు సముద్రపు వాసన సైతం ఉంటుంది.
ఎందుకంత విలువ..? డిమాండ్..?
స్వచ్ఛత, నాణ్యతను బట్టి ఈ అంబర్గ్రిస్ కిలో నుంచి విలువ రూ.1 కోటి నుంచి రూ.2 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అత్యంత అరుదుగా లభిస్తుండడంతో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో భారీ ధర పలుకుతుందని అధికారులు పేర్కొంటున్నారు. సెంట్లు, పర్ఫ్యూమ్లు, ఇతర సుగంధ పరిమళాల తయారీలో అంబర్‌గ్రిస్‌ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. ప్రాచీన సంస్కృతిలో దీన్ని ఆహారంలో రుచి కోసం కూడా వాడేవారు. మద్యం, పొగాకుతో కలిపి కూడా ఉపయోగించిన దాఖలాలు ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

