గురువారం 02 జూలై 2020
National - Jun 30, 2020 , 11:46:39

పేటీఎంను కూడా నిషేధించాలి : తమిళనాడు ఎంపీ మనికం ఠాగూర్‌

పేటీఎంను కూడా నిషేధించాలి : తమిళనాడు ఎంపీ మనికం ఠాగూర్‌

చెన్నై : భారత ప్రభుత్వం టిక్‌టాక్, యూసీ బ్రౌజర్‌తో పాటు చైనాకు చెందిన 59 యాప్‌లను సోమవారం నిషేధించింది. దీనిపై కాంగ్రెస్‌ నేత, తమిళనాడు ఎంపీ మనికం ఠాగూర్‌ స్పందించారు. భారత్‌లో చైనాకు సంబంధించిన 59 యాప్‌ను నిషేదించిన కేంద్రం చర్యలను స్వాగతిస్తున్నామని అన్నారు. అలాగే ఈ కామర్స్‌ అప్లికేషన్‌ అయిన పేటీఎంను కూడా నిషేధించాలని ఆయన ప్రధాని మోడీని కోరారు. భారీ చైనా పెట్టుబడులు ఉన్న పేటీఎంను నిషేధించాలని కోరుతూ మణికం ఠాగూరు ట్వీట్‌ చేశారు. 

చైనా సంస్థలైన యాంట్ ఫైనాన్షియల్స్, అలీబాబా గ్రూప్ నుంచి పేటీఎంకు 29.71%, 7.18% పెట్టుబడులు ఉన్నాయని చూపించే వికీపీడియా పేజీ స్ర్కీన్‌శాట్లను తన ట్వీట్‌కు అటాచ్ చేస్తూ భారీ చైనీస్ పెట్టుబడులున్న పేటీఎంను నిషేధించాలని కోరారు. అలీబాబా గ్రూప్, యాంట్ ఫైనాన్షియల్స్ కూడా చైనాకు చెందిన మల్టీనేషన్ కంపెనీలే అని గుర్తుచేశారు. దేశంలోని స్థానిక ఉత్పత్తులను పెంచి, విదేశి ఉత్పత్తులను తగ్గించాలన్నా మోడీ పేటీఎంను నిషేధించాలని కోరారు.


logo