చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్.. ఇవాళ ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలైపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. డీఎంకే ఫైల్స్ పేరుతో బీజేపీ నేత స్టాలిన్ సర్కార్‌పై ఆరోపణలు చేశారు. బీజేపీ నేత అన్నామలై ఈ అంశంపై పలు మీడియా సమావేశాలు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్టాలిన్ ఇవాళ డిఫమేషన్ కేసును ఫైల్ చేశారు. స్టాలిన్ ఫ్యామిలీ అవినీతికి పాల్పడుతున్నట్లు బీజేపీ నేత తన డీఎంకే ఫైల్స్ ద్వారా ఆరోపించారు. ఆ ఫైల్స్‌కు సంబంధించిన కొన్ని ఆడియోలను బీజేపీ నేత రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి చేసిన కొన్ని వ్యాఖ్యలను ఆ ఆడియో ద్వారా రిలీజ్ చేశారు.