e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home News 30 మంది ప్రాణాల‌ను ర‌క్షించి.. ఆపై ప్రాణాలొదిలాడు..

30 మంది ప్రాణాల‌ను ర‌క్షించి.. ఆపై ప్రాణాలొదిలాడు..

చెన్నై : ఓ ఆర్టీసీ బ‌స్సు వేగంగా క‌దులుతోంది.. ఈ క్ర‌మంలోనే బ‌స్సు డ్రైవ‌ర్‌కు ఛాతిలో నొప్పి.. త‌న‌కు గుండెపోటు అని గుర్తించిన స‌ద‌రు డ్రైవ‌ర్‌.. బ‌స్సును రోడ్డు ప‌క్క‌కు ఆపాడు. బ‌స్సులో ఉన్న 30 మంది ప్రాణాల‌ను ర‌క్షించి.. ఆపై ప్రాణాలొదిలాడు డ్రైవ‌ర్. ఈ విషాద ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని మ‌ధురైకి స‌మీపంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది.

త‌మిళ‌నాడు ఆర్టీసీ బ‌స్సు గురువారం ఉద‌యం ఓ 30 మంది ప్ర‌యాణికుల‌తో అర‌ప్ప‌ల‌యం నుంచి కొడైకెనాల్‌కు బ‌య‌ల్దేరింది. ఈ బ‌స్సును న‌డుపుతున్న ఆరుముగమ్‌(44)కు ఉద‌యం 6:20 గంట‌ల‌కు ఛాతీలో నొప్పి రావడంతో బ‌స్సును రోడ్డు ప‌క్కకు ఆపాడు. అప్ర‌మ‌త్త‌మైన కండ‌క్ట‌ర్ అంబులెన్స్‌కు స‌మాచారం అందించాడు. అంత‌లోనే డ్రైవ‌ర్ కుప్ప‌కూలిపోయాడు. బ‌స్సులో ఉన్న 30 మంది ప్ర‌యాణికుల ప్రాణాల‌ను కాపాడి తాను ప్రాణాలొదిలిన డ్రైవ‌ర్ ప‌ట్ల ప్ర‌తి ఒక్క‌రూ సానుభూతి తెలిపారు. గ‌త 12 ఏండ్ల నుంచి ఆరుముగ‌మ్ త‌మిళ‌నాడు ఆర్టీసీలో డ్రైవ‌ర్‌గా సేవలందిస్తున్నాడు. డ్రైవ‌ర్‌కు ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement