Bamboo Tower | రాయ్‌పూర్, అక్టోబర్ 20: ఫ్రాన్స్‌లోని ఈఫిల్ టవర్ స్ఫూర్తితో దాన్ని పోలిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వెదురు టవర్‌ను ఛత్తీస్‌గఢ్‌లో నిర్మించారు. 140 అడుగుల ఎత్తు కలిగిన ఈ నిర్మాణం రాయ్‌పూర్‌కు 70 కిలోమీటర్ల దూరంలోని కతియా గ్రామంలో ఉంది. రూ.11 లక్షల వ్యయంతో నిర్మించిన 7400 కిలోల బరువు కలిగిన ఈ టవర్‌ను కేంద్ర రోడ్డు రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. పర్యాటక ఆకర్షణగా నిలిచిన ఈ టవర్‌ను భవ్య సృష్టి అనే స్టార్టప్ నిర్మించింది. దీని జీవిత కాలం 25 ఏండ్లని ఆ సంస్థ తెలిపింది. దీన్ని వాచ్ టవర్, టెలికామ్ టవర్, ప్రసార టవర్, రేడియో టవర్గా ఉపయోగించుకొనేందుకు తగిన సామర్థ్యం కలిగి ఉందని చెప్పింది.
న్యూఢిల్లీ: యూపీ బీజేపీ నేత కుమారుడు పాకిస్థాన్ అమ్మాయిని శుక్రవారం ఆన్లైన్లో ‘నిఖా’ చేసుకున్నాడు. బీజేపీ కార్పొరేటర్ అయిన తహసీన్ షాహిద్ తన కుమారుడు మొహమ్మద్ అబ్బాస్ హైదర్‌కు పాకిస్థాన్‌లోని లాహోర్‌కు చెందిన అంద్లీప్ జారాతో వివాహం నిశ్చయించాడు. వీసా కోసం ప్రయత్నించినప్పటికీ ఇరు దేశాల మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా లభించలేదు. మరోవైపు, వధువు తల్లి రానా యాస్మిన్ జైదీ అనారోగ్యంతో ఐసీయూలో చేరడంతో త్వరగా పెళ్లి జరిపించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మరోమార్గం లేక ఆన్లైన్లోనే తన కుమారుడికి నిఖా జరిపించాలని షాహిద్ నిర్ణయించుకున్నాడు.