‘భారత్ జోడో యాత్ర’ను పీవోకేలో చేపట్టండి.. రాహుల్ గాంధీకి ఉమాభారతి సూచన
‘రాహుల్ గాంధీ నిజంగా దేశాన్ని ఏకం చేయాలనుకుంటే, పీవోకేను భారత్‌తో కలుపాలి. అక్కడ యాత్ర చేయాలి. పీవోకేను భారత్‌తో కలిపిన తర్వాతే తిరిగి రావాలి. లేకపోతే అక్కడే ఉండాలి’ అని ఉమా భారతి అన్నారు.
భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమా భారతి ‘భారత్ జోడో యాత్ర’పై స్పందించారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో ఈ యాత్ర చేపట్టాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూచించారు. దేశాన్ని నిజంగా ఏకం చేయాలని ఆయన భావిస్తే ‘భారత్ జోడో యాత్ర’ను పీవోకేలో చేపట్టి ఆ ప్రాంతాన్ని భారత్‌లో కలుపాలని అన్నారు. ‘ఇది జరిగిన తర్వాతే భారత్‌కు తిరిగి రండి, లేకపోతే పీవోకేలోనే ఉండండి’ అని ఎద్దేవా చేశారు. బితుల్ ప్రాంతంలో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఉమా భారతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. ‘రాహుల్ గాంధీ నిజంగా దేశాన్ని ఏకం చేయాలనుకుంటే, పీవోకేను భారత్‌లో కలుపాలి. అక్కడ యాత్ర చేయాలి. పీవోకేను భారత్‌లో కలిపిన తర్వాతే తిరిగి రావాలి. లేకపోతే అక్కడే ఉండాలి’ అని అన్నారు.
కాగా, కాంగ్రెస్ పార్టీ పునరుద్ధరణ కోసం ప్రయత్నిస్తున్న రాహుల్ గాంధీ, బీజేపీకి వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేసేందుకు ‘భారత్ జోడో యాత్ర’ చేపట్టారు. ఈ యాత్ర ఇప్పటి వరకు పది రాష్ట్రాల మీదుగా సాగింది. 2,800 కిలోమీటర్ల దూరం కవర్ అయ్యింది. మంగళవారం ఢిల్లీ నుంచి తిరిగి ప్రారంభమై ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించనున్నది. ఈ నెలాఖరులో జమ్ముకశ్మీర్ చేరిన తర్వాత ఈ యాత్ర ముగుస్తుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

