Supriya Sule | ఇంటికెళ్లి వంట చేసుకోమన్నారు : బీజేపీ నేతల మైండ్‌సెట్‌పై సుప్రియా సూలే ఫైర్
మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత సుప్రియా సూలే (Supriya Sule) లోక్‌సభలో కీలక వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత సుప్రియా సూలే (Supriya Sule) లోక్‌సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. తనను ఉద్దేశించి మహారాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్ ఒకరు వివక్షాపూరిత వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. మహిళలను ఎదగనీయని వారిపక్షాన విపక్ష ఇండియా కూటమి నిలుస్తోందని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలను ఆమె తిప్పికొట్టారు. మహారాష్ట్రలో బీజేపీ మాజీ చీఫ్ ఒకరు తనను ఉద్దేశించి ఇంటికెళ్లి వంట చేసుకో అని వ్యాఖ్యానించారని ఆమె సభలో పేర్కొన్నారు. సుప్రియా సూలే మీరు ఇంటికెళ్లి వంట చేసుకోండి మేమంతా దేశాన్ని నడుపుతామని ఆయన అన్నారని, బీజేపీ మనస్తత్వం ఇదేనని ఆమె తేటతెల్లం చేశారు.
మహిళా సభ్యులపై బీజేపీ నేతలు వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తారు..అది వారి మైండ్సైట్కు అద్దం పడుతుందని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే పేర్కొన్నారు. తనకెదురైన వ్యక్తిగత అనుభవం ఇదని ఆమె చెప్పుకొచ్చారు. చట్టసభల్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ రూపొందిన మహిళా రిజర్వేషన్ బిల్లును మంగళవారం ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఇక మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులో జాప్యాన్ని ఎత్తిచూపుతూ మోదీ సర్కార్‌కు ఈ విషయంలో చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ (Jairam Ramesh) పేర్కొన్నారు. 2010లో కాంగ్రెస్ తీసుకువచ్చిన మహిళా బిల్లు తక్షణ అమలుకు ఉద్దేశించినదయితే, 2023 మహిళా బిల్లు జనగణన, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అనంతరం అమలుకు నోచుకుంటుందని ఇరు బిల్లులను పోల్చుతూ జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. 2010 మహిళా బిల్లు ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే అమలు చేసేందుకు ముందుకు తీసుకువచ్చామని వివరించారు.
అయితే 2023 బిల్లును జనగణన, డీలిమిటేషన్‌కు ముడిపెడుతూ అమలులో జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళా బిల్లులో నియోజకవర్గాల పునర్విభజనను ముడిపెట్టడంతో ఈ ప్రక్రియ క్లిష్టంగా మారిందని జైరాం రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే జనగణన, డీలిమిటేషన్‌ను చేపడతారా అని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. 2023లో బిల్లును నారీ శక్తి వందనంగా పిలిచే కంటే ముందే 2010లో ఈ బిల్లును స్టాండింగ్ కమిటీ పరిశీలించిందని, 9 ఏండ్ల ముందే ప్రధాని మోదీ ఈ బిల్లును ఆమోదింపచేయాల్సి ఉందని అన్నారు. మహిళా బిల్లుపై మోదీ సర్కార్‌కు చిత్తశుద్ది లేదని అన్నారు. ఎన్నికల్లో విజయావకాశాలు మసకబారడంతోనే కాషాయ సర్కార్‌కు నారీ శక్తి గుర్తుకువచ్చిందని ఎద్దేవా చేశారు.
Read More :
Jairam Ramesh | గెలుపు అవకాశాలు మసకబారడంతోనే మోదీ సర్కార్‌కు మహిళా బిల్లు గుర్తుకొచ్చింది : జైరాం రమేష్
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- Debate
- Reminder
- Supriya Sule
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 21-10-2023 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

