న్యూఢిల్లీ: శారీరక వైకల్యాల కారణాన్ని చూపుతూ ఏ వ్యక్తినీ జ్యుడిషియల్ సర్వీసులో ఉద్యోగ నియామకం చేయకుండా అడ్డుకోలేరని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పును వెలువరించింది.
కొన్ని రాష్ర్టాల జ్యుడిషియల్ సర్వీసులలో శారీరక వైకల్యం ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు నిరాకరించడాన్ని సవాలు చేస్తూ మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ చూపులేని అభ్యర్థి తల్లి రాసిన లేఖను సుమోటోగా విచారణకు స్వీకరించిన కోర్టు ఈ తీర్పును వెలురించింది. శారీరక వైకల్యాలను కారణంగా చూపుతూ ఏ ఒక్కరినీ జ్యుడిషియల్ సర్వీసులో నియామకాల కోసం తిరస్కరించకూడదని స్పష్టం చేసింది.