Justice Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్ఐఆర్.. పిటీషన్‌పై విచారణకు సుప్రీం అంగీకారం
Justice Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆ పిటీషన్‌పై బుధవారం విచారణ చేపట్టనున్నారు.
న్యూఢిల్లీ: అలహాబాద్ హైకోర్టు జస్టిస్ యశ్వంత్ వర్మ(Justice Yashwant Varma)పై.. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న అంశంపై సుప్రీంకోర్టు స్పందించింది. ఆ న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో.. ఆయనపై కేసు నమోదు చేయాలని సుప్రీంలో పిటీషన్ దాఖలైంది. దానిపై అత్యవసర విచారణ చేపట్టాలని పిటీషనర్ కోరారు. అయితే ఆ అంశంపై చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మాషితో కూడిన ధర్మాసనం రియాక్ట్ అయ్యింది. పిటీషన్లో లోపాలు సవరిస్తే, మంగళవారం ఆ పిటీషన్‌ను విచారణకు స్వీకరిస్తామని ధర్మాసనం పేర్కొన్నది. మాథ్యూస్ నెదుంపర అనే వ్యక్తి పిటీషన్ వేశారు. అయితే లోపాలను సవరిస్తానని, కానీ ఆ పిటీషన్‌పై బుధవారం విచారణ చేపట్టాలని మాథ్యూస్ కోర్టును కోరారు. అత్యున్నత న్యాయస్థానం దానికి అంగీకారం తెలిపింది.
మార్చి 14వ తేదీన .. హాళీ రోజు రాత్రి.. ఢిల్లీలో ఉంటున్న జస్టిస్ వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. స్టోర్‌రూమ్‌లో నోట్ల కట్టలను కాల్చివేసినట్లు ఆధారాలు కనిపించాయి. ఇంకా గుట్టలు గుట్టలుగా క్యాష్ ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ స్టోర్‌రూమ్‌ను అనేక మంది వాడుకుంటారని, తనకు క్యాష్తో సంబంధం లేదని చెప్పారు. అప్పుడు సీజేఐగా ఉన్న జస్టిస్ సంజీవి్ ఖన్నా.. జస్టిస్ వర్మపై దర్యాప్తునకు ఆదేశించారు. దాని ద్వారా రాజీనామా చేయాలని కోరారు. కానీ జస్టిస్ వర్మ రాజీనామాకు అంగీకరించకపోవడంతో ఆ విషయాన్ని రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీకి లేఖ ద్వారా జస్టిస్ ఖన్నా తెలియజేశారు.
నేరాభియోగం కింద తక్షణమే జస్టిస్ వర్మపై దర్యాప్తు చేపట్టాలని పిటీషన్లో మాథ్యూస్‌తో పాటు మరో ముగ్గరు డిమాండ్ చేశారు. జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణల్లో నిజం ఉన్నట్లు ఇన్‌హౌజ్ కమిటీ కూడా రిపోర్టు సమర్పించింది. ఇన్‌హౌజ్ విచారణ రిపోర్టు ఆధారంగా జస్టిస్ వర్మపై చర్యలు తీసుకోవాలని పిటీషనర్ కోరాడు.
జస్టిస్ వర్మ రాజీనామాకు అంగీకరించకపోవడంతో.. ఆయన్ను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేశారు. కేంద్రం దీనికి క్లియరెన్స్ ఇచ్చింది. కానీ అలహాబాద్, లక్నో బార్ సంఘాలు ఆయన ట్రాన్స్ఫర్ను వ్యతిరేకించాయి. జడ్జిగా ప్రమాణం చేసినా.. ఆయనకు ఎటువంటి జుడిషియల్ వర్క్‌ను అప్పగించలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shah Rukh Khan | షారుఖ్ ఖాన్ ‘కింగ్’ సంచలనం.. విడుదల ముందే రూ. 800 కోట్ల భారీ బిజినెస్!
ACP Manasvi Vashistha: ఎవరీ మనస్వి వశిష్ట.. ఢిల్లీ ఏసీపీని ఎందుకు బదిలీ చేశారు?
Mahabubabad | బైపాస్ వద్ద గుండె, లివర్‌ను పోలిన అవయవాలు.. మహబూబాబాద్ జిల్లాలో కలకలం!
బాచారం ఉర్సు వేడుకల్లో పాల్గొన్న మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి
Sridhar Babu vs Gaddam Vamsi | వారిని సస్పెండ్ చేయవద్దు.. మంత్రి శ్రీధర్‌బాబుకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చురకలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

