కోర్సు మధ్యలో ఫీజులు పెంచరాదు
పెరుగుతున్న ఉన్నత విద్య ఖర్చుల కోసం ప్రణాళికలు వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్న విద్యార్థులు, వారి కుటుంబాలకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. అసాధారణ పరిస్థితులలో తప్ప ప్రైవేట్ వృత్తి విద్యా కళాశాలలు కోర్సు మధ్యలో ఫీజులను పెంచకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది.
- అడ్మిషన్కు ముందే ఫీజు వివరాలు విద్యార్థులకు చెప్పాలి
- ప్రైవేట్ ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలకు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ, అక్టోబర్ 16 : పెరుగుతున్న ఉన్నత విద్య ఖర్చుల కోసం ప్రణాళికలు వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్న విద్యార్థులు, వారి కుటుంబాలకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. అసాధారణ పరిస్థితులలో తప్ప ప్రైవేట్ వృత్తి విద్యా కళాశాలలు కోర్సు మధ్యలో ఫీజులను పెంచకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది. విద్యార్థులు ప్రవేశం తీసుకునే ముందే కోర్సు మొత్తం కాలానికి వారు చెల్లించాల్సిన ఫీజుల గురించి కళాశాలలు స్పష్టత ఇవ్వాలని న్యాయస్థానం పేర్కొంది. ప్రవేశం తర్వాత అసాధారణ పరిస్థితులలో మాత్రమే ఫీజుల పెంపునకు అనుమతి ఇవ్వాలని కోర్టు పేర్కొంది. పశ్చిమ బెంగాల్లోని డాక్టర్ బీసీ రాయ్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ విద్యార్థులపై విధించిన 37 శాతం ఫీజు పెంపును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఫీజుల విషయంలో నెలకొన్న అనిశ్చితి విద్యార్థులు, వారి కుటుంబాలపై గణనీయమైన ఆర్థిక భారాన్ని మోయగలదని జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం తెలిపింది. వృత్తి విద్యా నియంత్రణకు బాధ్యత వహించే అధికారులు విద్యార్థులు కళాశాలలో చేరడానికి ముందే తమ ఆర్థిక బాధ్యతలను తెలుసుకునేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోర్టు నొక్కిచెప్పింది.
వృత్తి విద్యా కోర్సుల ఫీజులు సాధారణ కోర్సుల ఫీజుల కంటే 711 శాతం ఎక్కువగా ఉన్నాయని తెలిపే నివేదికలను న్యాయస్థానం ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు, వారి కుటుంబాలు తాము చెల్లించాల్సిన ఫీజు మొత్తంలో ప్రవేశం పొందిన తర్వాత వచ్చే ఊహించని మార్పులకు లోనుకాకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఆర్థిక అనిశ్చితి విద్యార్థుల చదువుపై ప్రభావం చూపవచ్చని, దీర్ఘకాలంలో ఇది భవిష్యత్తులో వృత్తి నిపుణుల నాణ్యత, వ్యక్తిత్వాలపై పరిణామాలకు దారితీయవచ్చని కూడా ధర్మాసనం హెచ్చరించింది. వృత్తి విద్యను అభ్యసించడానికి చాలా భారతీయ కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని కోర్టు అభిప్రాయపడింది. తమ పిల్లలు మంచి ఉద్యోగాలు సంపాదించి, మరింత సురక్షితమైన భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఇది దోహపదపడుతుందనే ఆశతో తల్లిదండ్రులు తరచుగా వారి చదువు కోసం సంవత్సరాల తరబడి పొదుపు చేస్తారని పేర్కొంది.వృత్తి విద్యా కోర్సుల కోసం చెల్లించడానికి చాలా కుటుంబాలు విద్యా రుణాలపై కూడా ఆధారపడతాయని తెలిపింది. ఊహించని ఫీజు పెరుగుదల వారి ఆర్థిక ప్రణాళికను దెబ్బతీస్తుందని పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

