కేంద్రానికి, సీబీఐకి సుప్రీం నోటీసులు

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులపై సీబీఐ విచారణ చేపట్టాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు కుమారుడు భరత్ దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం, విచారణ సంస్థ సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే దాఖలైన పిటిషన్ నుంచి ప్రతివాదులుగా ఉన్న ఏపీ ప్రభుత్వం, డీజీపీ, సీఐడీలను తీసివేసి కేంద్ర ప్రభుత్వం, సీబీఐలను చేర్చేందుకు అనుమతిస్తూ కేసు విచారణను ఆరు వారాలు వాయిదా వేసింది.
ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ఈనెల 14న ఏపీ సీఐడీ పోలీసులు రఘురామకృష్ణరాజును అరెస్టు చేశారు. పోలీసులు తనను కొట్టారని మరుసటి రోజు మెజిస్ట్రేట్‌కు తన కాళ్లు చూపిస్తూ లిఖిత పూర్వకంగా పిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో సీఔడీ అధికారులపై సీబీఐతో విచారణ చేపట్టాలని, తన తండ్రిపై థర్డ్ డిగ్రీ ఉపయోగించిన అధికారులను శిక్షించాలని భరత్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై జస్టిస్ వినీత్ శరణ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది.
ప్రస్తుత పిటిషన్లో ప్రతివాదులుగా ఉన్న ఏపీ ప్రభుత్వం, డీజీపీ, సీఐడీలను తీసివేసి.. ఆ స్థానంలో సీబీఐ, కేంద్రాన్ని చేర్చాలని పిటినర్ తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ధర్మాసనానికి విన్నవించారు. దీనికి అనుమతించవద్దని ఏపీ ప్రభుత్వ సీనియర్ న్యాయవాది దవే చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రతివాదులుగా కేంద్రాన్ని, సీబీఐని చేర్చుతూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆరు వారాలు వాయిదా వేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు సమయం ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం.. రెండు వారాల్లో దానికి రిప్లై ఇవ్వాలని పిటిషనర్‌ను ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
Ramayana | రూ.5000 కోట్ల వసూళ్లు సాధిస్తేనే సేఫ్.. భయపెడుతున్న ‘రామాయణ’ బ్రేక్ ఈవెన్ టార్గెట్!
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

