జర్నలిస్ట్ జుబైర్‌కు మధ్యంతర బెయిల్
న్యూఢిల్లీ : ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్‌కు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. ప్రస్తుతం ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో ఎఫ్ఐఆర్లపై మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. అలాగే భవిష్యత్‌లో నమోదయ్యే కేసుల్లోనూ అరెస్టు చేయకుండా కోర్టు ఊరటనిచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌కు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్ఏ బోపన్న ధర్మాసనం బదిలీ చేసింది.
జుబైర్ ట్వీట్లపై దర్యాప్తు చేసేందుకు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను కోర్టు రద్దు చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి జుబైర్‌పై ప్రస్తుతం నమోదైన కేసులతో పాటు భవిష్యత్‌లో నమోదయ్యే ఎఫ్ఐఆర్లు సైతం ఢిల్లీకి బదిలీ అవుతాయని స్పష్టం చేసింది. కోర్టు ఎఫ్ఐఆర్లను రద్దు చేయనప్పటికీ.. తనపై ఉన్ని అన్ని కేసులను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ కోర్టును ఆశ్రయించేందుకు జుబైర్‌కు అవకాశం కల్పించింది. ఎట్టకేలకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జుబైర్ జైలు నుంచి విడుదలకానున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

