Pawan Khera: పవన్ ఖేరాకు ఊరట.. ముందస్తు బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు
Pawan Khera: కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఇవాళ ఆయనకు ముందస్తు బెయిల్‌ను మంజూరీ చేసింది. జస్టిస్ జేకే మహేశ్వరి, ఏఎస్ చందూర్కర్ ధర్మాసనం ఈ కేసులో ఆదేశాలు ఇచ్చింది. ముందస్తు బెయిల్ జారీ చేసేందుకు గౌహతి హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా(Pawan Khera)కు ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఇవాళ ఆయనకు ముందస్తు బెయిల్‌ను మంజూరీ చేసింది. అస్సాంలో నమోదైన పరువునష్టం, ఫోర్జరీ కేసులో ఆయనకు ఊరట దొరికింది. జస్టిస్ జేకే మహేశ్వరి, ఏఎస్ చందూర్కర్ ధర్మాసనం ఈ కేసులో ఆదేశాలు ఇచ్చింది. ముందస్తు బెయిల్ జారీ చేసేందుకు గౌహతి హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. అయితే ఆ తీర్పును సుప్రీంకోర్టు పక్కనపెట్టేసింది. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భుయాన్‌కు పలు దేశాల్లో పాస్‌పోర్టులు, ఆస్తులు ఉన్నట్లు ఇటీవల పవన్ ఖేరా ఆరోపించారు.
ఆ ఆరోపణల నేపథ్యంలో ఖేరాపై అస్సాంలో పోలీసు కేసు పెట్టారు. ఏప్రిల్ 7న ఢిల్లీలోని ఖేరా ఇంటికి అస్సాం పోలీసులు వెళ్లారు. కానీ అక్కడ ఆయన ఉన్నట్లు గుర్తించలేదు. ఆ తర్వాత తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ఖేరా దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ హైకోర్టు ఆయనకు 10 రోజుల రిలీఫ్ ఇచ్చింది. కానీ ఏప్రిల్ 15వ తేదీన తెలంగాణ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఆ తర్వాత ఖేరా గౌహతి కోర్టుకు వెళ్లారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

