Supreme Court: సీఈసీ జ్ఞానేశ్‌కు వ్యతిరేకంగా పిల్స్.. ఈసీ, కేంద్రానికి సుప్రీం నోటీసులు
Supreme Court: చీఫ్ ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై దాఖలైన అభ్యర్థనలపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఆ పిల్స్ అంశంలో కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేవలం వార్తా కథనాల ఆధారంగా సీఈసీ విధులను అడ్డుకోలేమని కోర్టు చెప్పింది.
న్యూఢిల్లీ: చీఫ్ ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై దాఖలైన అభ్యర్థనలపై ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court) విచారణ చేపట్టింది. ఆ పిల్స్ అంశంలో కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కమీషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీల అనుమతి లేకుండానే అక్టోబర్ 2025 నుంచి ఆగస్టు 2026 మధ్య కాలంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ 14 నిర్ణయాలను తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలపై సుప్రీంలో పిల్ దాఖలు చేశారు.
చీఫ్ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ వీ మోహనతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. పిల్స్‌పై వివరణ ఇవ్వాలని కోరుతూ జ్ఞానేశ్, సందూ, జోషి, ఈడీ డైరెక్టర్ జనరల్ సీమాఖన్నా, సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమీషనర్ మానేశ్ గార్గ్‌లను కోరింది. సంధూ, జోషి అనుమతి లేకుండానే సీఈసీ జ్ఞానేశ్ నిర్ణయాలు తీసుకున్నారని, మార్గదర్శకాలను మార్చేశారని, సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారని రాకేశ్ కుమార్ సింగ్, శైలేంద్ర మణి త్రిపాఠిలు తమ పిల్స్‌లో ఆరోపించారు.
సీఈసీ విధులను అడ్డుకోవాలంటూ సీనియర్ న్యాయవాది వికాశ్ సింగ్ చేసిన అభ్యర్థనను సుప్రీం తిరస్కరించింది. కేవలం వార్తా కథనాల ఆధారంగా ఎన్నికల సంఘం వివరణ లేకుండా ఎటువంటి ఆదేశాలను ఇవ్వబోమని సుప్రీం పేర్కొన్నది. సీఈసీ విధులను కూడా అడ్డుకోలేమని కోర్టు చెప్పింది. అక్రమ రీతిలో సర్ సమయంలో ఓటర్లను డిలీట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- CEC
- EC
- Gyanesh Kumar
- PILs
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

