పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు
పిల్లల ఇంటర్నెట్ వినియోగంపై వయసు ఆధారంగా సంపూర్ణ నిషేధం విధించడం సమంజసం కాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఇంటర్నెట్ను వినియోగించుకునే పిల్లల హక్కులను కాపాడుతూనే, ఆన్లైన్ వేధింపుల నుంచి వారికి రక్షణ కల్పించాలని పేర్కొంది. బాలల లైంగిక వేధింపులకు సంబంధించిన అశ్లీల కంటెంట్‌ను వేగంగా గుర్తించి తొలగించేందుకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం, డిజిటల్ వేదికలను ఆదేశించింది. ఇంటర్నెట్ వినియోగ స్వేచ్ఛ, పిల్లల భద్రత పరస్పర విరుద్ధమైనవి కావని కోర్టు అభిప్రాయపడింది.
- బాలల ఆన్లైన్ భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలి
- తొలగించిన లైంగిక వేధింపుల డాటాబేస్ ఏర్పాటు చేయాలి
- కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ, అక్టోబర్ 17: పిల్లల ఇంటర్నెట్ వినియోగంపై వయసు ఆధారంగా సంపూర్ణ నిషేధం విధించడం సమంజసం కాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఇంటర్నెట్ను వినియోగించుకునే పిల్లల హక్కులను కాపాడుతూనే, ఆన్లైన్ వేధింపుల నుంచి వారికి రక్షణ కల్పించాలని పేర్కొంది. బాలల లైంగిక వేధింపులకు సంబంధించిన అశ్లీల కంటెంట్‌ను వేగంగా గుర్తించి తొలగించేందుకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం, డిజిటల్ వేదికలను ఆదేశించింది. ఇంటర్నెట్ వినియోగ స్వేచ్ఛ, పిల్లల భద్రత పరస్పర విరుద్ధమైనవి కావని కోర్టు అభిప్రాయపడింది. సంపూర్ణ ఆంక్షలు విధిస్తే పిల్లలు నియంత్రణలేని, ప్రమాదకరమైన వెబ్సైట్ల వైపు మళ్లే అవకాశం ఉందని హెచ్చరించింది.
జాతీయ డాటా బేస్ ఏర్పాటు
ఆన్లైన్లో బాలల లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ కొనసాగుతుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. ఒక వేదికలో తొలగించిన కంటెంట్ ఇతర వేదికల్లో కూడా గుర్తించి తొలగించేలా సమన్వయ వ్యవస్థ లేదని ఎత్తిచూపింది. ఈ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని, జాతీయ డాటాబేస్ ఏర్పాటుకు మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒక అంశంపై ఒకే ఫిర్యాదు అందితే, దాని ఆధారంగా కంటెంట్‌ను తొలగించడం లేదా డాటాబేస్‌లో చేర్చడం తగదని న్యాయస్థానం స్పష్టంచేసింది. తప్పుగా గుర్తించిన కంటెంట్‌పై ఫిర్యాదు చేసేందుకు, పరిష్కారం పొందేందుకు ప్రత్యేక వ్యవస్థ ఉండాలని సూచించింది.
పాఠశాల స్థాయి నుంచే అవగాహన
బాలల్లో ఆన్లైన్ భద్రతపై అవగాహన పెంచేందుకు ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే విస్తృత ప్రచార, అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఇంటర్నెట్లో ఎదురయ్యే ప్రమాదాలను పిల్లలు గుర్తించడం, వేధింపులు లేదా బెదిరింపులు ఎదురైనప్పుడు భయపడకుండా సహాయం కోరడం వంటి అంశాలపై వారికి అవగాహన కల్పించాలని సూచించింది. బాలలపై ఆన్లైన్ వేధింపులకు సంబంధించిన కంటెంట్ వ్యాప్తిని అరికట్టడంతోపాటు వారి రాజ్యాంగ హక్కులు, స్వేచ్ఛకు భంగం కలగకుండా చూడటమే ఈ ఆదేశాల ప్రధాన ఉద్దేశమని స్పష్టంచేసింది. పిల్లల రక్షణ పేరుతో ఏకపక్ష ఆంక్షలు విధించకుండా, పొరపాటున కంటెంట్‌ను తొలగించే పరిస్థితులు తలెత్తకుండా సమతుల్యమైన వ్యవస్థను అమలుచేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది.
వయోపరిమితి మాత్రమే రక్షించదు: నల్సార్
ఆన్లైన్ హాని నుంచి పిల్లలను రక్షించడానికి వయోపరిమితి మాత్రమే సరిపోకపోవచ్చని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, ఇండియా గవర్నెన్స్ అండ్ పాలసీ ప్రాజెక్ట(గ్యాప్)కు చెందిన తాజా నివేదిక హెచ్చరించింది. యువ వినియోగదారులకు తమ సేవలు కలిగించే ప్రమాదాల పట్ల డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను మరింత జవాబుదారీగా చేసే విస్తృతమైన చట్టం అవసరమని కూడా ఆ నివేదిక పిలుపునిచ్చింది. పిల్లల భద్రత ఆవశ్యకత:భారతదేశానికి వయస్సుకు తగిన డిజిటల్ పాలన మార్గాలు అనే శీర్షికతో ఉన్న ఈ నివేదిక కనీస వయోపరిమితి నిబంధనలతో పాటు ప్లాట్‌ఫారమ్‌లపై అమలు చేయదగిన బాధ్యతలు, బలమైన నియంత్రణ సామర్థ్యం, ఆన్లైన్ సేవల రూపకల్పనలోని భద్రతా చర్యలు తప్పనిసరిగా ఉండాలని సూచించింది.
ఆ బాహ్య శక్తుల వల్లే ఈ అనిశ్చితి
కొన్ని బాహ్యశక్తుల ప్రభావం కారణంగానే నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ స్నాతకోత్సవ నిర్వహణలో అనిశ్చితి ఏర్పడిందని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ విమర్శించారు. కొందరు విద్యార్థులు ఆయన స్నాతకోత్సవ హాజరు ప్రతిపాదనను వ్యతిరేకించిన కొన్ని వారాల తర్వాత సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో జరిగిన యూనివర్సిటీ స్నాతకోత్సవంలో విశ్వవిద్యాలయ చాన్స్‌లర్ హోదాలో ఆయన ప్రసంగిస్తూ ‘అణచివేత అనే పిరికితనం కంటే బహిరంగ చర్చ అనే పవిత్రత’ను ఎంచుకున్నందుకు విద్యార్థులను ప్రశంసించారు.
‘కొన్ని బాహ్యశక్తుల ప్రభావంతో తలెత్తిన ఊహించని, దురదృష్టకర పరిస్థితులు అనిశ్చితిని తీసుకువచ్చాయి. దీనివల్ల ఈ కార్యక్రమం మనం ఆశించిన విధంగా జరగకపోవచ్చునని కొంతకాలం పాటు అనిపించింది.’ అని ఆయన అన్నారు. అయితే ఆ బాహ్యశక్తులు ఎవరన్న విషయాన్ని సీజేఐ వెల్లడించ లేదు. ‘కొద్దిమంది నిజాయితీ లేని వారి కుట్రలను, నిజాయితీపరులైన బహుజనుల సంకల్పం అధిగమించగలదని మీరు మోసపు తెరను తొలగించి వెల్లడించారు’ అని పట్టభద్రులవుతున్న విద్యార్థులను ఉద్దేశించి సీజేఐ పేర్కొన్నారు. న్యాయవిద్య అంటే కేవలం శాసనాలు, పూర్వ తీర్పులను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం మాత్రమే కాదని సీజేఐ సూర్యకాంత్ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

