NEET UG | ప్రశ్నాపత్రం లీకేజీ వాస్తవమే.. రీ టెస్ట్ మా చివరి చాయిస్: సుప్రీంకోర్టు
దేశవ్యాప్తంగా దుమారం రేపిన నీట్ యూజీ-2024 లీకేజీ, పరీక్షలో అక్రమాల వ్యవహారంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రశ్నాపత్రం లీకేజీ అయిన మాట వాస్తవమేనని స్పష్టం చేసిన సర్వోన్నత న్యాయస్థానం..
- పరీక్ష పవిత్రత దెబ్బతింటే రీ టెస్టుకు ఆదేశం
- నీట్-యూజీ లీకేజీ పిటిషన్లపై సుప్రీంకోర్టు వ్యాఖ్య
- ప్రశ్నాపత్రం లీకేజీ వాస్తవమే..అదెంత వరకు వెళ్లింది?
- పూర్తి వివరాలు ఇవ్వాలని కేంద్రం, ఎన్టీఏకు ఆదేశాలు
- దర్యాప్తుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సీబీఐకి సూచన
NEET UG | న్యూఢిల్లీ, జూలై 8: దేశవ్యాప్తంగా దుమారం రేపిన నీట్ యూజీ-2024 లీకేజీ, పరీక్షలో అక్రమాల వ్యవహారంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రశ్నాపత్రం లీకేజీ అయిన మాట వాస్తవమేనని స్పష్టం చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన నీట్ యూజీ రీ టెస్ట్‌కు ఆదేశాలు ఇచ్చే ముందు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.
రీ టెస్ట్‌ను చివరి అవకాశంగా పరిగణిస్తామని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. దానికి ముందు.. అసలు లీకైన పరీక్ష ప్రశ్నాపత్రం ఎంత వరకు వెళ్లింది? దాని వలన ఎంత మంది లబ్ధి పొందారు? అనే అంశాలను గుర్తించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నది. పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని భావిస్తే, రీ టెస్ట్‌కు ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది.
ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించిన వివరాలను ఇవ్వాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)లను ఆదేశించింది. పరీక్షలో అక్రమాలకు పాల్పడిన వారిని ఎంత మందిని గుర్తించారు? పేపర్ లీకేజీకి అక్రమార్కులు అనుసరించిన విధానం ఏంటి? అనే వివరాలు కూడా ఇవ్వాలని ఆదేశించింది. మొత్తం 38 పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది.
పరీక్ష మొత్తం సమగ్రత దెబ్బతిన్నదా?
నీట్ లీకేజీ, పరీక్షలో అక్రమాల ఆరోపణలపై చేస్తున్న దర్యాప్తు ఎంత వరకు వచ్చిందో నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా సీబీఐని ఆదేశించింది. రీటెస్ట్‌కు ఆదేశాలు ఇవ్వడంపై స్పందిస్తూ ‘అక్రమాల ఆరోపణలు ఒక వ్యవస్థాగత స్థాయిలో జరిగాయా? అనేది పరిశీలించాల్సి ఉంది.
అదే విధంగా ఈ అక్రమాల వల్ల పరీక్ష మొత్తం సమగ్రత దెబ్బతిన్నదా? మోసం చేసి లబ్ధి పొందిన అభ్యర్థులను నిజాయితీ గల విద్యార్థుల నుంచి వేరు చేయవచ్చా? అనే అంశాలను కూడా చూడాలి’ అని స్పష్టం చేసింది. అక్రమాలు మొత్తం పరీక్ష ప్రక్రియపై ప్రభావం చూపిన పరిస్థితుల్లో, అక్రమాలకు పాల్పడిన అభ్యర్థులను వేరు చేసే వీలుకాని పక్షంలో రీ టెస్ట్‌కు ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని అభిప్రాయపడింది.
ఎంత మంది ఫలితాలు నిలిపేశారు?
ప్రశ్నాపత్రం లీకేజీ నుంచి ఎంత మంది లబ్ధి పొందారు? వారిపై తీసుకొన్న చర్యలేంటో చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది. ‘అక్రమాలకు పాల్పడిన వారిలో ఎంత మంది ఫలితాలను నిలుపుదల చేశారు? అలాంటి వాళ్లు ప్రాంతాల వారీగా ఎంత మంది ఉన్నారు?’ చెప్పాలని పేర్కొన్నది.
తప్పు చేసిన వారిని గుర్తించలేకపోతే..
టెలిగ్రామ్, వాట్సాప్, ఇతర ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా ప్రశ్నాపత్రం లీకేజీ జరిగితే, అది దావానలంలా వ్యాప్తి చెందినట్టు అని అభిప్రాయపడింది. ‘పరీక్ష పవిత్రత కోల్పోతే, అప్పుడు రీటెస్టుకు ఆదేశాలు ఇస్తాం. తప్పు చేసిన వారిని మనం గుర్తించలేకపోతే, రీ టెస్ట్‌కు ఆదేశిస్తాం’ అని న్యాయస్థానం ఈ సందర్భంగా పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

