Arvind Kejriwal | కేజ్రీవాల్‌కు నిరాశ : బెయిల్‌పై హైకోర్టు ఉత్తర్వులు వచ్చే వరకూ వేచిచూడాలన్న సుప్రీంకోర్టు
Arvind Kejriwal : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ట్రయల్ కోర్టు తనకు మంజూరు చేసిన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది.
Arvind Kejriwal : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ట్రయల్ కోర్టు తనకు మంజూరు చేసిన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు జూన్ 26న విచారణను చేపట్టనున్నట్టు వెల్లడించింది. హైకోర్టు ఆర్డర్ ఇచ్చే వరకూ వేచిచూడాలని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేయడంతో కేజ్రీవాల్‌కు నిరాశ ఎదురైంది.
బెయిల్‌పై స్టే మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ప్రశ్నించారు. విచారణ తొలి రోజే బెయిల్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇవ్వాల్సిన అవసరం ఏముందని ఆయన సర్వోన్నత న్యాయస్ధానాన్ని ప్రశ్నించారు.
హైకోర్టు తన ఉత్తర్వులు వెలువరించేంత వరకూ సీఎం ఎందుకు స్వేచ్ఛగా ఉండరాదని అన్నారు. సీఎంకు అనుకూలంగా బెయిల్ ఉత్తర్వులు ఉన్నాయని, ఆయన విదేశాలకు పారిపోయే ప్రమాదం కూడా లేదని వివరించారు.
Read More :
Maoists | ఛత్తీస్‌గఢ్ అడవుల్లో నకిలీ నోట్ల ముద్రిస్తున్న నక్సల్స్..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

