Sunita Kejriwal | కేజ్రీవాల్ సింహం..ఆయనను కాషాయ పాలకులు జైల్లో బంధించలేరు : సునీతా కేజ్రీవాల్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు నిరసనగా విపక్షాలు ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఆదివారం మెగా ర్యాలీ నిర్వహించాయి.
Sunita Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు నిరసనగా విపక్షాలు ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఆదివారం మెగా ర్యాలీ నిర్వహించాయి. ఈ ర్యాలీలో కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ మాట్లాడుతూ తన భర్త అరవింద్ కేజ్రీవాల్‌ను మన ప్రధాని నరేంద్ర మోదీ జైలులో పెట్టారని ప్రధాని నిర్ణయం సరైనదేనా అని ప్రశ్నించారు. కేజ్రీవాల్ నిజమైన దేశ భక్తుడని, నిజాయితీపరుడని మీరు నమ్ముతున్నారా అని ప్రజలను అడిగారు.
జైలుపాలైన కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేతలు కోరుతున్నారని, ఆయన రాజీనామా చేయాలా అని ర్యాలీకి హాజరైన ప్రజలను ఆమె ప్రశ్నించారు. మీ కేజ్రీవాల్ సింహం లాంటి వాడని, ఆయనను ఎంతోకాలం కాషాయ పాలకులు జైల్లో బంధించలేరని సునీతా కేజ్రీవాల్ అన్నారు. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీల్యాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్‌కు సంఘీభావంగా చేపట్టిన ఈ ర్యాలీకి పెద్దసంఖ్యలో భాగస్వామ్య పార్టీల నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. దేశ రాజధానిలోని రాంలీలా మైదాన్‌లో ఈ జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తదితులు పాల్గొన్నారు.
విపక్ష నేతలను అరెస్ట్ చేస్తూ పాలక బీజేపీ ప్రజాస్వామ్యానికి పాతరేస్తోందని నేతలు మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. మార్చి 21 తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయని, సిట్టింగ్ సీఎంను ఎందుకు అరెస్ట్ చేశారో ఎవరికీ అర్ధం కాలేదని ఆప్ మంత్రి గోపాల్ రాయ్ మండిపడ్డారు. ఢిల్లీ సీఎంను అరెస్ట్ చేసే ముందు జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్‌ను అరెస్ట్ చేశారని, ఈడీ, సీబీఐలను దుర్వినియోగం చేస్తూ మోదీ సర్కార్ ప్రజాస్వామ్యంపై దాడికి తెగబడుతోందని దుయ్యబట్టారు.
Read More :
Sai Pallavi | తెలంగాణ యాసలో జెమ్ అనిపించుకున్న సాయి పల్లవి.. ఇప్పుడు ఆ యాసలో ఎలా మెప్పిస్తుందో!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

