ముంబై: మహారాష్ట్రలో బీజేపీ కుట్రపూరిత రాజకీయాలవల్ల ఆదివారం నాడు శరద్‌పవార్ నేతృత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (NCP) నిట్టనిలువున రెండు ముక్కలైంది. శరద్‌పవార్ అన్న కుమారుడు అజిత్‌పవార్ మరో 8 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారులో చేరారు. మిగతా ఎనిమిది మందిలో సీనియర్ నేతలైన ప్రఫుల్ పటేల్, చగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే తదితరులు ఉన్నారు. అదేవిధంగా లోక్‌సభ సభ్యుడు సునీల్ తట్కరే కూడా అజిత్ వర్గంలో చేరాడు.
అంతేగాక మహారాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం 53 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలకుగాను 40 మంది ఎమ్మెల్యేలు తమ వెంటే ఉన్నారని అజిత్‌పవార్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆదివారం ఆయన మహా గవర్నర్‌కు ఇచ్చిన లేఖలో కూడా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం అజిత్ వర్గంలోని సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (NCP) నూతన అధ్యక్షుడిగా లోక్‌సభ సభ్యుడు సునీల్ తట్కరేను నియమిస్తున్నట్లు ఆ ప్రెస్మీట్లో ప్రఫుల్ ప్రకటించారు.
Maharashtra | Sunil Tatkare appointed as new state president of Nationalist Congress Party, announces party leader Praful Patel. pic.twitter.com/GSgHl8zOIN
— ANI (@ANI) July 3, 2023