ముంబై : మహారాష్ట్రలో ఇవాళ సుఖోయ్-30 ఎంకేఐ ఫైటర్ విమానం(Fighter Aircraft) నేలకూలింది. వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం.. నాసిక్ జిల్లాలో క్రాష్ అయ్యింది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ వద్ద ఆ ఫైటర్ విమానం ఓవరాలింగ్ కోసం వెళ్లింది. విమానంలో ఉన్న ఇద్దరు పైలెట్లు సురక్షితంగా బయటకు వచ్చారు. ఈ ప్రమాదానికి చెందిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.