Viral Video | నెటిజన్లను ఆకట్టుకుంటున్న జపనీస్ స్టైల్ స్ప్రింగ్ రోల్స్
చీట్ మీల్స్ లేకుంటే ట్రీట్స్ ఫ్రెండ్స్‌తో పార్టీ ఇలా సందర్భం ఏదైనా ముందుగా దేశీ స్ట్రీట్ ఫుడ్ వెరైటీలు (Viral Video) కండ్ల ముందు మెదులుతుంటాయి.
న్యూఢిల్లీ : చీట్ మీల్స్ లేకుంటే ట్రీట్స్ ఫ్రెండ్స్‌తో పార్టీ ఇలా సందర్భం ఏదైనా ముందుగా దేశీ స్ట్రీట్ ఫుడ్ వెరైటీలు (Viral Video) కండ్ల ముందు మెదులుతుంటాయి. దేశీ స్నాక్స్‌లో ఉన్న ఆ టేస్ట్ మనల్ని అటువైపు లాగుతుంటుంది. ఇక భోజనప్రియుల డైరీలో ప్రత్యేక స్ధానం కల్పించేలా ఓ నయా డిష్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. జపనీస్ తరహా స్ప్రింగ్ రోల్స్ నెటిజన్లను ఆకట్టుకున్నాయి. ఫుడ్పండిట్స్ అనే ఇన్స్టాగ్రాం ఫుడ్ పేజ్ ఈ హాట్ క్లిప్‌ను షేర్ చేసింది.
ఈ వీడియోలో వీధి వ్యాపారి ఎదుట కస్టమర్లు బారులు తీరి తమ వంతు కోసం వేచిచూస్తుండటం కనిపిస్తుంది. తాను వినూత్న రుచులను ఆఫర్ చేస్తుండటంతోనే తన స్టోర్ ముందు కస్టమర్లు బారులుతీరారని ఫుడ్ వ్లాగర్‌కు విక్రేత చెబుతుండటం చూడొచ్చు. తాను మష్రూం కార్న్ స్ప్రింగ్ రోల్స్, పనీర్ మలై, పనీర్ మసాలా స్ప్రింగ్ రోల్స్ విక్రయిస్తానని చెప్పుకొచ్చాడు.
తాను ఇటీవల జపాన్ సందర్శించానని, అప్పటినుంచి జపనీస్ టచ్‌తో స్ప్రింగ్ రోల్స్ తయారుచేస్తున్నానని అన్నాడు. మష్రూం కార్న్ స్ప్రింగ్ రోల్స్‌ను టేస్ట్ చేసిన వ్లాగర్ తాను ఇప్పటివరకూ టేస్ట్ చేసిన అద్భుతమైన స్ప్రింగ్ రోల్స్‌లో ఇవి ఒకటి అని రాసుకొచ్చాడు. చండీఘఢ్లో ఈ స్ప్రింగ్ రోల్స్‌ను విక్రయిస్తున్నారని వ్లాగర్ వెల్లడించాడు. జపనీ స్టైల్ స్ప్రింగ్ రోల్స్ అని వీడియోను షేర్ చేస్తూ వ్లాగర్ రాశాడు.
Read More :
Mangalavaaram | మంగళవారం జాతరకు పుష్ప వస్తున్నారు.. అజయ్ భూపతి అప్డేట్ వైరల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

