Stock Markets | ఐదు రోజుల వరుస లాభాలకు అడ్డుకట్ట.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ల (Stock Markets) లో గత ఐదు రోజుల వరుస లాభాలకు ఇవాళ బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, అమెరికా-ఇరాన్ (US-Iran) మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై నెలకొన్న అనిశ్చితి ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దాంతో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు.
Stock Markets : దేశీయ స్టాక్ మార్కెట్ల (Stock Markets) లో గత ఐదు రోజుల వరుస లాభాలకు ఇవాళ బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, అమెరికా-ఇరాన్ (US-Iran) మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై నెలకొన్న అనిశ్చితి ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దాంతో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. ఫలితంగా స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 931.25 పాయింట్లు పతనమై 76,631.65 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 222.25 పాయింట్లు నష్టపోయి 23,775.10 వద్ద స్థిరపడింది.
ట్రేడింగ్ సెషన్ ఆద్యంతం అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, లార్సెన్ అండ్ టుబ్రో వంటి దిగ్గజ షేర్లు ప్రధానంగా నష్టాల్లో ఉన్నాయి. ప్రధాన సూచీలు బలహీనపడినప్పటికీ, బ్రాడర్ మార్కెట్లు మాత్రం కొంత నిలకడగా ఉన్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 0.25 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 0.20 శాతం చొప్పున స్వల్ప లాభాలతో ముగిశాయి. రంగాల వారీగా చూస్తే బ్యాంకింగ్ షేర్లు మార్కెట్లను పతనం చేశాయి. అమెరికా పట్ల తీవ్ర అవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బఘేర్ ఘలీబాఫ్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్లలో ఆందోళన పెంచాయి. కాల్పుల విరమణ ఒప్పందాలను అమెరికా పదేపదే ఉల్లంఘిస్తోందని బఘేర్ ఆరోపించారు. ఈ పరిణామాలతో ఐదు రోజులుగా కొనసాగుతున్న రూపాయి ర్యాలీకి కూడా బ్రేక్ పడింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

