వైరల్ పోస్ట్ : దేశీ ఫిల్టర్ కాఫీ ఎంజాయ్ చేసిన స్టార్‌బక్స్ కో-ఫౌండర్ జెవ్ సీగల్
హైఎండ్ కాఫీ బ్రాండ్ స్టార్‌బక్స్ కో-ఫౌండర్ జెవ్ సీగల్ బెంగళూర్‌లోని విద్యార్ధి భవన్లో మసాలా దోసెను టేస్ట్ చేసి ఆపై దేశీ ఫిల్టర్ కాఫీని ఎంజాయ్ చేశారు.
బెంగళూర్ : హైఎండ్ కాఫీ బ్రాండ్ స్టార్‌బక్స్ కో-ఫౌండర్ జెవ్ సీగల్ బెంగళూర్‌లోని విద్యార్ధి భవన్లో మసాలా దోసెను టేస్ట్ చేసి ఆపై దేశీ ఫిల్టర్ కాఫీని ఎంజాయ్ చేశారు. 1943లో ఏర్పాటై విశేష ప్రాచుర్యం పొందిన విద్యార్ధి భవన్లో జెవ్ సీగల్ కొద్దిసేపు గడిపి అక్కడి రుచులను ఆస్వాదించారు.
స్ధానిక వంటకాలను రుచి చూసేందుకు బెంగళూర్‌లో విద్యార్ధి భవన్ బెస్ట్ ప్లేస్‌గా చెబుతుంటారు. స్టార్ బక్స్ కౌ ఫౌండర్ జెవ్ సీగల్ తమ రెస్టారెంట్లో మసాలా దోసెను రుచి చూసి ఘుమఘుమలాడే కాఫీని ఆస్వాదించారని, ఆయన తన అనుభవాన్ని తమ గెస్ట్బుక్లోనూ రాసుకొచ్చారని విద్యార్ధి భవన్ తమ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది.
అమెరికన్ వ్యాపారవేత్త జెవ్ సీగల్ 1971లో స్టార్‌బక్స్‌ను మరో భాగస్వామితో కలిసి ప్రారంభించారు. ఆపై ఆయన స్టార్‌బక్స్ వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్‌గా వ్యవహరించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్లో పాల్గొనేందుకు సీగల్ బెంగళూర్ వచ్చారు. జెవ్ సీగల్ విద్యార్ధి భవన్లో గడిపిన క్షణాలపై నెటిజన్లు పెద్ద సంఖ్యలో రియాక్ట్ అయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

