న్యూఢిల్లీ: స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌పై విమాన ప్రయాణికులు మండిపడ్డారు. బే వద్ద విమానాన్ని నిలుపగా పికప్ బస్సుల కోసం సుమారు 45 నిమిషాలు ఎదురుచూడాల్సి వచ్చింది. దీంతో విసిగిపోయిన కొందరు ప్రయాణికులు బే నుంచి టెర్మినల్ వైపు నడిచారు. ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగింది. స్పైస్‌జెట్‌కు చెందిన హైదరాబాద్-ఢిల్లీ విమానం 186 మంది ప్రయాణికులతో శనివారం రాత్రి 11.24 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరింది. విమానం ఆరు నిమిషాలు ముందుగా రావడంతో ప్రయాణికులు సంబరపడ్డారు.
అయితే ఆ విమానాన్ని టెర్మినల్‌కు దూరంగా బేలో నిలిపివేశారు. దీంతో ఒక బస్సు కొందరు ప్రయాణికులను టెర్మినల్ వద్దకు తీసుకెళ్లింది. మిగతా ప్రయాణికులను తరలించేందుకు ఇతర బస్సులు రావడం చాలా ఆలస్యమైంది. దీంతో విమాన ప్రయాణికులు సుమారు 45 నిమిషాలపాటు బస్సుల కోసం ఎదురు చూశారు. విసిగిపోయిన ప్రయాణికులు ఆ సంస్థపై మండిపడ్డారు. విమానం ఆగిన చోట నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న టెర్మినల్‌కు కొందరు నడవసాగారు. పది నిమిషాలు నడిచిన తర్వాత బస్సులు అక్కడకు వచ్చాయి.
మరోవైపు ఈ సంఘటనపై స్పైస్‌జెట్ వివరణ ఇచ్చింది. ‘ప్రయాణికులను టార్మాక్ నుంచి టెర్మినల్ బిల్డింగ్‌కు తీసుకెళ్లడానికి బస్ కోచ్‌ల రాకలో కొంత ఆలస్యం జరిగింది. మా సిబ్బంది పదే పదే అభ్యర్థనలు చేసినప్పటికీ, కొంతమంది ప్రయాణికులు టెర్మినల్ వైపు నడవడం ప్రారంభించారు. బస్‌లు రావడంతో నడుస్తున్న వారితో సహా ప్రయాణికులంతా టెర్మినల్ భవనానికి వాటిలో ప్రయాణించారు’ అని ఆ సంస్థ పేర్కొంది. ఈ సంఘటనపై డీజీసీఏ దర్యాప్తు చేస్తున్నది.
కాగా, జూన్ 19 నుంచి జూలై 5 మధ్య స్పైస్‌జెట్‌కు చెందిన ఎనిమిది విమానాల్లో సాంకేతిక సమస్యలు వచ్చాయి. పలు విమానాశ్రయాలకు అవి మళ్లాయి. దీంతో ఎనిమిది వారాలపాటు 50 శాతం విమానాలను మాత్రమే నడపాలని ఆ సంస్థను డీజీసీఏ ఆదేశించింది.
How often do you see this happening at T3 of the Indira Gandhi International Airport in New Delhi? @flyspicejet kept up cooked up for 45 minutes after announcing “early arrival” of 6 mins at 11:24pm on the SG 8108 Hyd-Delhi. They parked the flight really far away with no buses. pic.twitter.com/sgkR9gXs3Y
— Lasya Nadimpally (@nlasya) August 6, 2022