లక్నో: వేగంగా వెళ్తున్న కారు ఒక గుర్రపు బండిని ఢీకొట్టింది. దీంతో ఆ గుర్రం ఏడు అడుగుల మేర గాలిలోకి ఎగిరింది. సుమారు 20 అడుగుల దూరంలో పడిన గుర్రం అక్కడికక్కడే చనిపోయింది. (Car Rams Into Horse Cart) ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో కొందరు వ్యక్తులు ఒక గుర్రం బండిపై ప్రయాణించారు. బాగ్‌పట్‌లోని గౌరీపూర్ ప్రాంతంలో రోడ్డు మలుపు నుంచి ఢిల్లీ-సహారన్పూర్ హైవేలోకి ఆ గుర్రం బండి ప్రవేశించింది.
కాగా, జాతీయ రహదారిపై ఒక కారు వేగంగా దూసుకెళ్లింది. ఆ రహదారిపైకి ప్రవేశించిన ఆ గుర్రం బండిని బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి ఆ గుర్రం ఏడు అడుగుల మేర గాలిలోకి ఎగిరింది. సుమారు 20 అడుగుల దూరంలో అది పడింది. తీవ్రంగా గాయపడిన ఆ గుర్రం అక్కడికక్కడే చనిపోయింది. గుర్రం బండిలో ప్రయాణించిన వారితో సహా ఐదుగురు వ్యక్తులు ఈ సంఘటనలో గాయపడ్డారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురు వ్యక్తులను ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్రం మృతికి కారణమైన కారును గుర్తించారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
कार की टक्कर से घोड़ा हवा में 7 फुट ऊपर उछला और 20 फुट दूर जाकर गिरा। घोड़े की मौत हो गई। कार और घोड़ा-बुग्गी में सवार 5 लोग घायल हो गए।
📍बागपत, उत्तर प्रदेश pic.twitter.com/p3SIKMrnsF— Sachin Gupta (@SachinGuptaUP) December 9, 2024