SP Chief | కాషాయ పార్టీలో విభేదాలపై అఖిలేష్ కీలక వ్యాఖ్యలు
SP Chief : యూపీలో యోగి ఆదిత్యానాథ్ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం అస్ధిరతతో సతమతమవుతున్నదని ఎస్పీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు.
SP Chief : యూపీలో యోగి ఆదిత్యానాథ్ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం అస్ధిరతతో సతమతమవుతున్నదని ఎస్పీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. బీజేపీ నేతలు అంతర్గత కుమ్ములాటలతో కీచులాడుకుంటున్నారని ఆరోపించారు. కాషాయ నేతల మధ్య ఆధిపత్య పోరుతో అభివృద్ధి అటకెక్కిందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఉపాధ్యాయులను వేధిస్తున్నదని పేర్కొన్నారు.
అఖిలేష్ యాదవ్ బుధవారం లక్నోలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్ర రాజధాని లక్నోలో గృహాల కూల్చివేత నిర్ణయాన్ని వాయిదా వేశారని, యోగి సర్కార్ బలహీనపడుతున్నదనేందుకు ఇది విస్పష్ట సంకేతమని చెప్పారు. కాగా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మధ్య విభేదాలు మరింతగా ముదిరినట్లు తెలుస్తున్నది. మరోవైపు డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర మంత్రి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన సమావేశమయ్యారు.
ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్ భూపేందర్ చౌదరితో కూడా జేపీ నడ్డా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ పేలవ ప్రదర్శన తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్య మధ్య విభేదాలు మరింతగా పెరిగినట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో యూపీలో పార్టీ వ్యూహాన్ని రూపొందించేందుకు ఈ సమావేశాలు జరిగినట్లు సమాచారం. బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి బయటకు వెళ్లేటప్పుడు మౌర్య మీడియాతో మాట్లాడలేదు.
Read More :
Janhvi Kapoor | మరో తెలుగు సినిమాకు జాన్వీ కపూర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

