న్యూఢిల్లీ: డీపీటీ3 వ్యాక్సినేషన్లో ఆగ్నేయాసియా ముందంజలో నిలిచిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది భారత్లో డిప్తీరియా, పెర్టుసిస్, టెటానస్ (డీపీటీ3) మూడో డోస్ వ్యాక్సినేషన్ 93 శాతం పూర్తయినట్టు తెలిపింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్ సంయుక్త నివేదికలో తెలిపాయి.