నేడు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం
కాంగ్రెస్| పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆదివారం జరగనుంది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన వర్చువల్‌గా ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు.

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆదివారం జరగనుంది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన వర్చువల్‌గా ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. కాగా, కరోనా వ్యాక్సినేషన్లో కేంద్ర ప్రభుత్వం విఫలమయిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఒక్కో రాష్ట్రానికి ఒక్కోవిధంగా టీకాలను పంపిణీ చేస్తున్నారని విమర్షిస్తున్నది. దేశంలో కొవిడ్ సెకండ్ వేవ్‌కు ప్రధాని తీసుకున్న నిర్ణయాలే కారణమని ఆరోపణలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఎలా వ్యవహరించాలనే విషయాలను చర్చించే అవకాశం ఉన్నది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 19న ప్రాంభమై ఆగస్టు 13 వరకు కొనసాగుతాయి. మొత్తం 19 పనిదినాల్లో ఉభయసభల కార్యకలాపాలు జరుగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్నాయి. పార్లమెంట్ ఉభయసభలకు (లోక్‌సభ, రాజ్యసభ) ఇవే సమయాలు వర్తిస్తాయి. కరోనా మూడో వేవ్ తప్పదని పేర్కొంటున్న నేపథ్యంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

