శుక్రవారం 05 జూన్ 2020
National - May 11, 2020 , 13:57:34

సోనియా గాంధీ మీ ట్రైన్ టికెట్ తీసుకున్నారు..

సోనియా గాంధీ మీ ట్రైన్ టికెట్ తీసుకున్నారు..


హైద‌రాబాద్‌: వ‌ల‌స కూలీల‌ను త‌ర‌లించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా శ్రామిక్ రైళ్ల‌ను న‌డుపుతున్న విష‌యం తెలిసిందే. అయితే పంజాబ్ నుంచి  బీహార్‌లోని ముజాఫ‌ర్‌పూర్‌కు ఓ రైలు వెళ్లింది. ఆ రైలు బ‌టిండా రైల్వే స్టేష‌న్‌లో ఆగిన‌ప్పుడు .. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అమ‌రింద‌ర్ రాజా కొన్ని క‌ర‌ప‌త్రాల‌ను పంచారు. మీ ట్రైన్ టికెట్‌ను సోనియా గాంధీ కొన్నారంటూ ఆయ‌న ప్ర‌చారం చేశారు.  సోనియా వ‌ల్ల మీరంతా బెనిఫిట్ పొందారంటూ ఆయ‌న రైల్వే స్టేష‌న్‌లో ప్ర‌చారం చేస్తూ క‌నిపించారు. రైలు క‌ద‌ల‌డానికి ముందు ఆయ‌న స్టేష‌న్‌లో కొంద‌రు కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి ప్ర‌సంగం చేశారు.  మీ టికెట్ చార్జీలు సోనియా చెల్లించారు, సీఎం అమ‌రింద్ సింగ్, రాష్ట్ర పార్టీ చీఫ్ సునిల్ జాక‌ర్ మిమ్మ‌ల్ని పంపిస్తున్నార‌ని ఆ ఎమ్మెల్యే అన్నారు. క‌ర‌ప‌త్రంలో మొత్తం రాశామ‌ని, వాటిని చదువుకోవాల‌ని ఆ ఎమ్మెల్యే వాటిని వ‌ల‌స కూలీల‌కు అంద‌జేశారు. logo