Man Kills Mother | ఒక వ్యక్తితో తల్లికి సంబంధంపై కుమారుడు ఆగ్రహం.. హత్య చేసి మృతదేహం దహనం
Man Kills Mother | ఒక వ్యక్తితో తల్లికి ఉన్న సంబంధంపై కుమారుడు ఆగ్రహించాడు. ఈ నేపథ్యంలో ఆమెను కొట్టి చంపాడు. మృతదేహాన్ని ఒకచోటకు తరలించి దహనం చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ వ్యక్తితో పాటు సహకరించిన మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు.
బెంగళూరు: ఒక వ్యక్తితో తల్లికి ఉన్న సంబంధంపై కుమారుడు ఆగ్రహించాడు. ఈ నేపథ్యంలో ఆమెను కొట్టి చంపాడు. మృతదేహాన్ని ఒకచోటకు తరలించి దహనం చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ వ్యక్తితో పాటు సహకరించిన మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. (Man Kills Mother) కర్ణాటకలోని మైసూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మదహళ్లి గ్రామానికి చెందిన 30 ఏళ్ల శివరుద్రప్ప తన తల్లి 48 ఏళ్ల సుధాపై అనుమానం వ్యక్తం చేశాడు. ఒక వ్యక్తితో ఆమెకు ఉన్న సంబంధాన్ని అతడు వ్యతిరేకించాడు.
కాగా, ఇటీవల ఆ వ్యక్తితో కలిసి బైక్‌పై తల్లి సుధ వెళ్లడాన్ని శివరుద్రప్ప చూశాడు. ఈ నేపథ్యంలో ఆగ్రహంతో రగిలిపోయాడు. ఆదివారం ఉదయం తల్లిని దారుణంగా కొట్టాడు. గాయపడిన ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించేందుకు బంధువులు ప్రయత్నించారు.
మరోవైపు తల్లిని తానే ఆసుపత్రికి తీసుకెళ్తానని బంధువులకు శివరుద్రప్ప చెప్పాడు. అయితే ఆమెపై మళ్లీ దాడి చేశాడు. రాయితో తలపై మోది తల్లిని హత్య చేశాడు. కనియనహుండి సమీపంలోని ఒక తోటలోకి ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లాడు. అక్కడ నిప్పంటించి దహనం చేసి పారిపోయాడు.
ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. తల్లిని హత్య చేసిన శివరుద్రప్పతో పాటు అతడికి సహకరించిన కజిన్స్ అయిన 24 ఏళ్ల ఆకాష్, 22 ఏళ్ల అభిని అరెస్ట్ చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

