15 రోజుల్లో మరో 1.92 కోట్ల వ్యాక్సిన్లు

న్యూఢిల్లీ: వచ్చే 15 రోజుల్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మరో 1.92 కోట్ల డోసుల వ్యాక్సిన్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ శుక్రవారం వెల్లడించారు. ఈ నెల 16 నుంచి 31 మధ్య ఈ వ్యాక్సిన్ డోసులు రాష్ట్రాలకు అందుతాయని చెప్పారు. ఇందులో 1.62 కోట్ల కొవిషీల్డ్ డోసులు, 29.49 లక్షల కొవాగ్జిన్ డోసులు ఉంటాయని ఆయన తెలిపారు. వినియోగిస్తున్న తీరు, రెండో డోసులు పొందాల్సిన వారి ఆధారంగా ఈ కేటాయింపులు జరపనున్నట్లు జవదేకర్ చెప్పారు. మే నెలలో ఇప్పటి వరకూ 1.7 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపిణీ చేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది.
ఈ కేటాయింపులకు సంబంధించి డెలివరీ షెడ్యూల్‌ను ముందుగానే అందరితో పంచుకోనున్నట్లు తెలిపింది. దీని ద్వారా సదరు వ్యాక్సిన్లను సక్రమంగా వినియోగించేలా ఆయా రాష్ట్రాలు ప్రణాళికలు వేసుకుంటాయని చెప్పింది. ఈ వ్యాక్సిన్ డోసులను కేవలం 45 ఏళ్లు పైబడిన వాళ్లకు మాత్రమే వేస్తారన్న విషయం తెలిసిందే. ఇవి కాకుండా వ్యాక్సిన్ తయారీ కంపెనీల నుంచి రాష్ట్రాలు, ప్రైవేటు హాస్పిటల్స్ నేరుగా కొనుగోలు చేసేందుకు మే నెలలో 4.39 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ఇక శుక్రవారం ఉదయం 7 గంటల వరకూ అందిన సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 17.93 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Jagadish Reddy | తెలంగాణ నీటి హక్కులను సీఎం తన గురువు చంద్రబాబు చేతిలో పెట్టిండు : జగదీష్‌రెడ్డి
KTR | బక్క పలచని యోధుడు బానిస సంకెళ్లు తెంచిన కథ.. మన తెలంగాణ జాతి కథ : కేటీఆర్
Health Tips | నిమ్మరసాన్ని దేంట్లో పడితే దాంట్లో వాడుతున్నారా .. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
KTR | ఉద్యమానికి ఊపిరులూదిన కరీంనగర్ ఖిల్లా ఇది : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

