న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: ప్రమాదవశాత్తూ కాలు కోల్పోయి నడవలేని స్థితిలో ఉన్నవాళ్లకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శుభవార్త చెప్పింది. లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేసే స్మార్ట్ కాలును అభివృద్ధి చేసినట్టు శుక్రవారం ప్రకటించింది. మైక్రో ప్రాసెసర్ ఆధారంగా పనిచేసే (ఎంపీకే) ఈ కాలును త్వరలోనే వాణిజ్యపరంగా ఉత్పత్తి చేస్తామని వెల్లడించింది.
ఒకటిన్న కిలోల బరువుండే ఈ కాలులో మైక్రో ప్రాసెసర్, హైడ్రాలిక్ డ్యాంపర్, మోకాలి సెన్సార్, మోకాలి కేస్, లిథియం అయాన్ బ్యాటరీ పరికరాలు ఉంటాయి. వ్యక్తి శరీర కండరాల నుంచి సిగ్నళ్లను గ్రహించి ముందుకు వెనుకకు నడిచేలా కదలటం ఈ కాలు ప్రత్యేకత. దీనిని విక్రం సారాభాయి స్పేస్ సెంటర్ అభివృద్ధి చేసింది.