అసమర్థుల చేతుల్లో విద్యార్థుల భవిష్యత్తు.. ప్రధాన్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలి : సీజేపీ
ఫలితాల పోర్టల్‌లో క్లౌడ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ సమస్య కారణంగా జేఈఈ(అడ్వాన్స్డ్) 2026 అభ్యర్థుల డాటా బహిర్గతమైందన్న వార్తలు, దేశ విద్యా వ్యవస్థను, డిజిటల్ మౌలిక సదుపాయాలను ఎంత అసమర్థ వ్యక్తులు నడుపుతున్నారో చూపిస్తున్నాయని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) గురువారం విమర్శించింది.
న్యూఢిల్లీ, జూన్ 4 : ఫలితాల పోర్టల్‌లో క్లౌడ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ సమస్య కారణంగా జేఈఈ(అడ్వాన్స్డ్) 2026 అభ్యర్థుల డాటా బహిర్గతమైందన్న వార్తలు, దేశ విద్యా వ్యవస్థను, డిజిటల్ మౌలిక సదుపాయాలను ఎంత అసమర్థ వ్యక్తులు నడుపుతున్నారో చూపిస్తున్నాయని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) గురువారం విమర్శించింది. సోషల్ మీడియాలో ప్రారంభమై ఆ తర్వాత విస్తృత రూపం దాల్చిన ఈ ఉద్యమ నాయకులు విద్యా రంగంలో జవాబుదారీతనాన్ని నిర్ధారించడంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విఫలమయ్యారని పేర్కొంటూ ఆయనను తక్షణమే తొలగించాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.
గురువారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో సీజేపీ నాయకులు మాట్లాడుతూ ఈ ఘటన విద్యార్థుల డాటా భద్రత, పరీక్ష విధానాల నిర్వహణపై కొత్త ఆందోళనలను రేకెత్తించిందని అన్నారు. దాదాపు రెండు లక్షల మంది విద్యార్థుల పేర్లు, ఫోన్ నంబర్లు, ఫొటోలు బహిర్గతమయ్యాయని ఆయన తెలిపారు. ఈ నెల 6న జంతర్ మంతర్ వద్ద నిరసన నిర్వహిస్తామని ఇదివరకే ప్రకటించిన సీజేపీ ఢిల్లీ పోలీసులు అనుమతి ఇవ్వకున్నప్పటికీ తమ ఆందోళన కొనసాగుతుందని వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

