Road accident : ఉత్తరప్రదేశ్లో ఇవాళ ఒకేరోజు రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ రెండు ప్రమాదాల్లో 12 మంది దుర్మరణం పాలయ్యారు. ఇవాళ మధ్యాహ్నం అగ్రా-లక్నో ఎక్స్ప్రెస్ వేపై ప్రయాణికులతో వెళ్తున్న ఓ డబుల్ డెక్కర్ బస్సు అదపుతప్పి ట్యాంకర్ను ఢీకొట్టింది. యూపీలోని కన్నౌజ్ జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ఇవాళ తెల్లవారుజామున కూడా యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఝాన్సీ-మీర్జాపూర్ హైవేపై వేగంగా వెళ్తున్న కారు అదపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కూడా ఆరుగురు మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒకేరోజు కేవలం ఐదు గంటల వ్యవధిలో యూపీలో రెండు ఘోర ప్రమాదాలు జరగడం గమనార్హం.
#WATCH | Kannauj, Uttar Pradesh: Six people died and 14 were injured after a double-decker bus collided with a water tanker on the Lucknow-Agra Expressway. pic.twitter.com/DN05CRcWjc
— ANI (@ANI) December 6, 2024