e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News క‌రోనాతో ప్ర‌ముఖ సితార్‌ విద్వాంసుడు దేవ‌బ్ర‌త చౌద‌రి క‌న్నుమూత‌

క‌రోనాతో ప్ర‌ముఖ సితార్‌ విద్వాంసుడు దేవ‌బ్ర‌త చౌద‌రి క‌న్నుమూత‌

క‌రోనాతో ప్ర‌ముఖ సితార్‌ విద్వాంసుడు దేవ‌బ్ర‌త చౌద‌రి క‌న్నుమూత‌

న్యూఢిల్లీ : ప్ర‌ముఖ సితార్‌ విద్వాంసుడు దేవ‌బ్ర‌త చౌద‌రి (85) క‌రోనాతో శ‌నివారం క‌న్నుమూశారు. దేవ‌బ్ర‌త చౌద‌రి మృతిని ఆయ‌న కుమారుడు ప్ర‌తీక్ చౌద‌రి సామాజిక మాధ్య‌మాల్లో ధ్రువీక‌రించారు.

క‌రోనా పాజిటివ్‌గా తేల‌డంతో ఇటీవ‌ల‌ దేవ‌బ్ర‌త చౌద‌రిని చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఓ ప్రైవేట్ దవాఖాన‌కు త‌ర‌లించారు. శుక్ర‌వారం సాయంత్రం ఆయ‌న ఆక్సిజ‌న్ స్థాయి ఒక్క‌సారిగా ప‌డిపోయింది.

దీంతో వైద్యులు ఆయ‌న‌ను వెంటిలేట‌ర్‌పై ఉంచి చికిత్స అందించారు. శ‌నివారం తెల్ల‌వారుజామున గుండెపోటు రావ‌డంతో దేవ‌బ్ర‌త మృతి చెందారు.

సంగీత ప్ర‌పంచానికి పండింత్ దేవ‌బ్ర‌త చౌద‌రి ఆరు ద‌శాబ్దాలపాటు మ‌రువ‌లేని సేవ‌లందించారు. సంగీత ప్రపంచానికి ఆయ‌న చేసిన సేవ‌ల‌కు గుర్తుగా ప‌ద్మ భూష‌ణ్‌, ప‌ద్మ‌శ్రీ, సంగీత నాట‌క అకాడ‌మీ అవార్డులు ఆయ‌న‌ను వ‌రించాయి. ఇదిలావుండగా కొవిడ్ కారణంగా ప్ర‌ముఖ నటుడు బిక్రమ్‌జిత్ కన్వర్‌పాల్‌ను శుక్ర‌వారం సినీ పరిశ్రమ కోల్పోయింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
క‌రోనాతో ప్ర‌ముఖ సితార్‌ విద్వాంసుడు దేవ‌బ్ర‌త చౌద‌రి క‌న్నుమూత‌

ట్రెండింగ్‌

Advertisement