Most Powerful Passports: పవర్ఫుల్ పాస్‌పోర్ట్‌ల్లో సింగపూర్ ఫస్ట్.. ఇండియా స్థానం ఎంతంటే?
Most Powerful Passports: ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాను రిలీజ్ చేశారు. హెన్లే పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం.. భారత పాస్‌పోర్ట్‌కు 82వ స్థానం దక్కింది. పవర్ఫుల్ పాస్‌పోర్ట్‌ల్లో సింగపూర్ ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది.
న్యూఢిల్లీ: ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల(Most Powerful Passports) జాబితాను రిలీజ్ చేశారు. హెన్లే పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం.. భారత పాస్‌పోర్ట్‌కు 82వ స్థానం దక్కింది. భారతీయ పాస్‌పోర్ట్‌తో 58 దేశాల్లో వీసా లేకుండా ఎంట్రీ ఇవ్వవచ్చు. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ డేటా ఆధారంగా ర్యాంక్‌లను రూపొందించారు. ప్రస్తుతం సెనిగల్, తజికిస్తాన్ దేశాల ర్యాంక్‌లతో ఇండియా ర్యాంక్ సమంగా ఉన్నది.
ఇక అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల్లో సింగపూర్ మొదటి స్థానంలో ఉన్నది. సింగపూర్ పాస్‌పోర్ట్ ఉన్నవారు 195 దేశాల్లో వీసా లేకుండానే ఎంట్రీ ఇవ్వవచ్చు. రెండో స్థానంలో జపాన్‌తో పాటు ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు పాస్‌పోర్ట్‌లు ఉన్నవారు 192 దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీ ఇవ్వవచ్చు.
మూడవ ర్యాంక్‌లో ఆస్ట్రియా, ఫిన్‌ల్యాండ్, ఐర్లాండ్, లగ్జంబర్గ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్వీడన్ దేశాలు ఉన్నాయి. ఈ దేశాల పాస్‌పోర్టు ఉన్నవారు 191 దేశాల్లోకి వీసా లేకుండా ఎంట్రీ పొందవచ్చు. నాలుగవ స్థానంలో యూకేతో పాటు న్యూజిలాండ్, నార్వే, బెల్జింయ, డెన్మార్క్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, పోర్చుగల్ ఉన్నాయి.
తాజా ర్యాంకింగ్స్‌లో అమెరికా 8వ స్థానానికి పడిపోయింది. అమెరికా వీసా ఉన్నవారు 186 దేశాలకు వీసా ఫ్రీ ప్రవేశం చేయవచ్చు. ఈస్టోనియా, లిథుయేనియా, యూఏఈ దేశాలు 9వ స్థానంలో, ఐస్‌ల్యాండ్, లాతివ్యా, స్లోవేకియా, స్లోవేనియా దేశాలు పదవ ర్యాంక్‌లో ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

